ఈత‌రం క‌థానాయ‌కుల‌కు డాన్సుల్లో స్పూర్తినిచ్చింది ఎవ‌రంటే చిరంజీవి పేరే చెబుతారు. స్టెప్పుల‌తో కూడా జ‌నాన్ని థియేట‌ర్లకు తీసుకురావ‌చ్చు... అని నిరూపించిన ఘ‌న‌త ఆయ‌నిది. అందుకే... చిరుని యంగ్ హీరోలు ఆద‌ర్శంగా తీసుకొంటున్నారు. సాయికుమార్ త‌న‌యుడు..ఆది డాన్సుల్లో త‌న ప్ర‌తాపం చూపించాడు. ఆదికి ప్రేర‌ణ క‌లిగించింది చిరంజీవేన‌ట‌. ఈ విష‌యాన్ని ఆది స్వ‌యంగా చెప్పాడు.

``డాన్సంటే చిరంజీవిగారిదే. ఆయ‌న స్టైల్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అది.. చ‌ర‌ణ్‌కి వ‌చ్చింది. చిరు చేసిన దాంట్లో 10%  చేసినా చాలు..! మేం విజయ‌వంతం అయిన‌ట్టే. సుకుమారుడులో కూడా చిరుని స్ఫూర్తిగా తీసుకొని డాన్సులు చేశా. నీలాకాశం... మెలోడీసాంగ్‌. స్టెప్పులు వేయ‌డానికి ఏమీ ఉండ‌దు. కానీ అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ‌లో చిరు వేసిన క్లాస్ డాన్స్‌ని కాపీ కొట్టా.. త‌ప్ప‌కుండా ఈ పాట విజువ‌ల్‌గా ఆకట్టుకొంటుంద‌``ని ఆది చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: