సినిమాలకు క్రేజ్ ఉండవచ్చు గానీ, ఓవర్ హైప్ ఉండకూడదని అంటారు. పలు సినిమాలు కనీసం 50 రోజులు ఆడాల్సినవి కూడా నిర్మాతలు ఇచ్చిన హైప్ కారణంగా అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విషయంలోనూ అదే జరుగుతున్నట్టుందని అందరూ అనుకుంటున్నారు. సినిమాలో వెంకటేష్; మహేష్ ఉన్నా తొలి టీజర్ లో అందరి దృష్టిని అంజలి ఆకర్షించేసింది. ఈ రోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే దిల్ రాజు చేస్తున్న ఓవర్ పబ్లిసిటీ కారణంగా శ్రీకాంత్ అడ్డాల ఓవర్ ప్రెజర్ను భరిస్తున్నారట. అందుకే ఎవరైనా తదుపరి చిత్రం గురించి మాట్లాడితే తనను ముందు ఈ గండం నుంచి బయటపడనివ్వమని సుతిమెత్తగా చెప్తున్నాడట. ఏదేమైనా శ్రీకాంత్ ఒక సినిమాను ఇన్నేళ్ళు చెక్కడం సబబు కాదేమో. 

మరింత సమాచారం తెలుసుకోండి: