సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ హావా పెరుగుతూ వస్తుంది. ఆ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచమైన అనుపమ పరమేశ్వరన్‌ పలు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్‌కి ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. చిన్న హీరోల వద్ద నుండి పెద్ద హీరోల వరకూ అనుపమ పరమేశ్వరన్‌కి అవకాశాలు వస్తున్నాయి.


అయితే తనకి వస్తున్న ఆఫర్స్ లో చిన్న హీరోలు అయినప్పటికీ కథ బాగుంటే నటించాలా? లేదంటే…పెద్ద హీరోలతోనే ట్రావెల్ చేయాలా? అనే డౌటు తనలో ఉంది. చిన్న చిత్రాలకు అయితే తన డిమాండ్స్ ని నిర్మాతలు,దర్శకుడు, హీరోలు తీరుస్తారు. కానీ పెద్ద చిత్రాలలో మాత్రం వారు ఏది చెబితే దానికి ఒప్పేసుకోవాలి అని బాధపడుతుంది. దీంతో ఈ బ్యూటీ బాగా ఆలోచించి ఓ సూత్రాన్ని చెప్పుకొచ్చింది. ‘‘దేనికీ తొందరపడకూడదు. నిదానంగా ఉండాలి.


అన్ని చోట్లా దుందుడుకుతనం పనికిరాదు. నేను చిన్నప్పటి నుంచి నమ్మే సూత్రం ఇదే’’ అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటికి తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా టాప్ హీరో విజయ్ మూవీ అవకాశాన్ని అందుకుంది. అయితే విజయ్ ఈమెకి ఓ కండిషన్ పెట్టాడు. దాదాపు 40 రోజుల బల్క్ కాల్షీట్స్ తన మూవీ కోసం ఇవ్వాలని విజయ్ కండిషన్. నిజానికి విజయ్ మూవీలో తన రోల్ నిడివి ప్రకారం ఓ 20 రోజుల కాల్షీట్స్ ఇస్తే సరిపోతుంది. మరి 40 రోజులు ఎందుకో తనకి అస్సలు అర్ధం కావటం లేదు.


అందులోనూ బల్క్ కాల్షీట్స్ అంటే చాలా రిస్క్ అంటుంది. విజయ్ తన చిత్ర యూనిట్ నుండి ఈ విధంగా అడిగించిన తీరు అనుపమ పరమేశ్వరన్‌వ కి పలు అనుమానాలను క్రియేట్ చేస్తుంది. ఒక్కసారిగా కాల్షీట్స్ ఇచ్చిన తరువాత వారు ఎటువంటి లొకేషన్స్ కు తీసుకువెళ్ళి…ఏ విధంగా కండిషన్స్ ని పెడతారో? తెగ భయపడుతుందట. మొత్తంగా పెద్ద హీరోతో ఈ అవకాశాన్ని వదులుకోవటం అనుపమకి అస్సలు ఇష్టం లేదు. అలా అని అన్ని రోజుల కాల్షీట్స్ సైతం తను ఇవ్వలేకపోతున్నారు.  దీంతో ప్రస్తుతం  అనుపమ పరమేశ్వరన్‌ డైలమాలో పడిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: