
తమిళ రాజకీయాలు రోజురోజుకు ట్విస్టుల మీద ట్విస్ట్ లతో వేడెక్కుతున్నాయి.జయలలిత మరణానంతరం ఏర్పడిన రాజకీయ సందిగ్దత,గందరగోళ పరిస్థితులు ,అన్నాడియంకే పార్టీలో సభ్యుల మధ్య విభేదాలు ,అక్రమాస్తుల ఆర్జన కేసులో శశికళ కటకటాలపాలవ్వడం ,అనూహ్యంగా పళనిస్వామీ ముఖ్యమంత్రి కావడం ఇలా ఒక విషయం గురించి ఆలోచించేలోపే ఇంకొక కొత్త మలుపు తిరుగుతుంది. వీటన్నిటి వల్ల ప్రజలు తీవ్ర అసహనానికి లోనయినట్లు,అసలు ప్రభుత్వంపై సంతృప్తికరంగా లేరని తెలుస్తుంది.
రాజకీయాలలోకి ఎప్పుడు వస్తాడా అని ఊరిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నాడో ఏమో కాని గత సంవత్సరం డిసెంబర్ 31 న ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజకీయ పార్టీని స్థాపించి రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలనుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసాడు.అంతేగాక పార్టీని స్థాపించాక తమ పార్టీ భావాలను,సిద్దాంతాలను ,విధానాలను తెలియపరుస్తామని ,ఏమి చేస్తామో ఏమి చేయమో కూడా చెప్తామని ,ఒకవేళ చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోతే మూడవ సంవత్సరానికే రాజీనామా చేస్తామని రాజకీయ డైలాగులు కూడా చెప్పేశాడు.
ఈ నేపథ్యంలో ఒక తమిళ పత్రికలో కమల్ హాసన్ రాసిన వ్యాసం తీవ్ర చర్చలకు దారితీసింది.తాను రాసిన వ్యాసంలో కమల్ చెబుతూ “తాను చేస్తున్న రెండు సినిమాలు పూర్తి అయ్యాక రాజకీయ పార్టీని నెలకొల్పుతానని స్పష్టం చేశాడు.గతంలో తాను రాజకీయ పార్టీని స్థాపిస్తాను అని చేసిన హామీని నిలబెట్టుకోవడానికి త్వరలోనే పార్టీని ఏర్పరచే ఆలోచనల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.అయితే రజనీ పార్టీ ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటన చేసి వారం రోజులు గడవకముందే కమల్ తన పార్టీ గురించిన అంశం గురించి ప్రస్తావించడం వల్ల కేవలం తను రజనీకాంత్ కి పోటీగా పార్టీ పెడుతున్నట్లు వార్నింగ్ ఇస్తున్నాడేమో అని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.