సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య కాస్టింగ్ కౌచ్ పై ఎంతో మంది నటీమనులు స్పందిస్తున్నారు.  తెలుగులో శ్రీరెడ్డి లెవనెత్తిన పోరాటం ఏ రేంజ్ లో కొనసాగింతో అందరికీ తెలిసిందే.  కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఘోరంగా నడుస్తుందని..పడక సుఖం అందిస్తేనే సినిమా చాన్సులు ఇస్తామని బాహాటంగానే చెబుతున్నారని ఇలాంటి అన్యాయాలు ఇకపై జరగకుండా ఉండాలని అందుకోసం సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలని పోరాటం చేస్తూ వస్తుంది. 
Image result for sri reddy
ఇక బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పలుమార్లు స్పందించిన హాట్ బ్యూటి  రాధికా ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.  తనకు కూడా అటువంటి వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది. ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, "బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలని నాకు ఫోన్ చేశారు. ఆపై వారితో నేను సమావేశం అయ్యాను. ఓ వ్యక్తి పేరు చెప్పి, అతనితో ఓ రాత్రి గడపడానికి ఓకేనా? అని అడిగారు. నేను నవ్వాను. తమాషా చేస్తున్నారా? అని అడిగాను. కుదరదని చెప్పాను. గో టూ హెల్ అంటూ వచ్చేశాను" అని చెప్పింది.
Image result for radhika apte hot
బాలీవుడ్ లో చాలా మంది దెవుళ్లు అని భావించే వారు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకునే వారు చాలా మంది ఉన్నారని..అలాంటి వారిలో ఎంతో మంది అమాయకపు అమ్మాయిలు సర్వనాశనం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఇక ఇదే విషయమై మరో నటి కల్కీ కోచ్ లిన్ మాట్లాడుతూ, "ఆఫ్ కోర్స్ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నన్ను కూడా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూసింది. అయితే నేను తప్పించుకున్నాను. ఎప్పుడైతే అసౌకర్యంగా అనిపిస్తుందో, అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసేదాన్ని" అని పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: