
-
akhil akkineni
-
Arjun Reddy
-
Baba Bhaskar
-
bhaskar
-
Cinema
-
dil raju
-
Film Nagar
-
Geetha Arts
-
Heart
-
Hero
-
Heroine
-
Huzur Nagar
-
Joseph Vijay
-
Love
-
malavika nair
-
media
-
Naga Chaitanya
-
nageshwara rao akkineni
-
News
-
Nithin Reddy
-
Oka Laila Kosam
-
prema
-
Raj Tarun
-
shalini
-
shalini pandey
-
tarun
-
Tarun Kumar
-
Tollywood
-
vijay
ఈ మధ్య మన టాలీవుడ్ లో హీరోయిన్స్ సమస్య బాగా వస్తుందనడంలో బాగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అక్కినేని వారసుడు అఖిల్ కి తన మొదటి సినిమా నుండి హీరోయిన్ సమస్య ఉంది. ఇప్పుడు నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే హీరోయిన్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇక మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాలన్ని ఫ్లాపయ్యాయి. దాంతో బాగా గ్యాప్ తీసుకొని కొన్ని కథలను సెలెక్ట్ చేసి కమిటయ్యాడు. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒకటే. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే, రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆ తర్వాత తెరకెక్కబోయో సినిమాకే హీరోయిన్ సెట్ అవడం లేదని టాక్.
గుండె జారి గల్లంతయ్యిందే ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రాజ్ తరుణ్ హీరోయిన్ కు వయసు సమస్య వచ్చిందని ఫిల్మ్ నగర్ లో ఒక మాట బాగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు మారినట్టుగా తెలుస్తోంది. ముందేమో శాలిని పాండే అనుకున్నారు. కారణాలు తెలియలేదు కాని ఆ తర్వాత సీన్ లోకి ఆదితి రావు హైదరి వచ్చింది. మీడియా కవరేజ్ లో కూడా తనే హీరోయిన్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు కట్ చేస్తే తన స్థానంలో మాళవిక నాయర్ ను తెచ్చినట్టు ఫ్రెష్ అప్ డేట్.
అయితే ఇదంతా యూనిట్ నుంచి వచ్చిన అఫీషియల్ న్యూస్ మాత్రం కాదని సమాచారం. కాని ఫిలిం నగర్ లో ఈ విషయంలో ఇదే టాక్ బాగా వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా హీరోయిన్ మారడానికి రెండు కారణాలు ఉన్నాయట. కథ రిత్యా హీరోయిన్ పాత్ర హీరో కన్నా వయసులో కాస్త పెద్దదట. అందుకే స్క్రీన్ మీద చూడటానికి రాజ్ తరుణ్ కన్నా కొంచెం మెచ్యుర్డ్ గా కనిపించే అమ్మాయిని సెట్ చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతోందట. మరో కారణం విషయానికి వస్తే రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఏదేమైనా సినిమా స్టార్ట్ అవక ముందే ఈ హీరోయిన్ కష్టాలేంటోనని రాజ్ తరుణ్ కంగారు పడుతున్నాడట. ఇక కొండా విజయ్ కుమార్ నితిన్ తో గుండె జారి గల్లంతయ్యిందే, నాగ చైతన్య తో ఒక లైలా కోసం వంటి ప్రేమ కథలను తెరకెక్కించి హిట్ కొట్టాడు.