అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా అల వైకుంఠపురములో.  సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమాలో పాటలు సూపర్‌ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్‌ తరువాత ఆ పాటలు మరింతగా ఫేమస్‌ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని సామజవరగమనా, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. కవర్ సాంగ్స్‌, తో పాటు టిక్‌టాక్‌లోనూ ఈ పాటలు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

 

తాజాగా ఈ సినిమాలో బుట్టబొమ్మ సాంగ్‌కు బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి టిక్‌ టాక్‌ చేసింది. చీర కట్టులో ఈ సాగరకన్య హోయలు పోతూ చేసి బుట్టబొమ్మ టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన శిల్ప బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం యోగా వీడియోలు చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది.

 

అల వైకుంఠపురములో సినిమా విషయానికి వస్తే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫెయిల్యూర్‌ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయి సూపర్‌ హిట్ టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటి పడి మరీ రికార్డ్ వసూళ్లు సాదించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

 

బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టబు, జయరామ్‌, మురళీ శర్మ, నవదీప్‌, సచిన్‌ కేడ్కర్‌లు కీలక పాత్రల్లో నటించారు. తమన్‌ అందించిన ఈ సినిమా మ్యూజిక్‌ ఈ దశాబ్ద బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఆల్బమ్‌లోని సామజవరగమనా, రాములో రాములా పాటలకు యూట్యూబ్‌లో వంద మిలియన్లకుపైగా  వ్యూస్‌ రావటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: