సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ తో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యింది తేజస్వి మడివాడ. ఆ సినిమా తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చాలానే చేసింది అమ్మడు. ఇక వర్మ ఐస్ క్రీమ్ లో అందాలతో అలరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 2 లో చేసిన హంగామా తెలిసిందే. సామ్రాట్ తో మంచి వ్యవహారం నడిపించిన తేజస్వి బయటకు వచ్చాక కూడా సామ్రాట్, తనీష్ లతో క్లోజ్ గా ఉంది. 

 

ప్రస్తుతం సినిమాలేమి చేయకపోయినా స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తుంది తేజస్వి. అయితే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా కమిట్మెంట్. కాస్టింగ్ కౌచ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం తేజస్వి చాలా కమిటెడ్ గా పనిచేసిందత తేజస్వి. సినిమాలో తేజస్వి అందరికి షాక్ ఇస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే కేవలం సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెడుతుందట తేజస్వి. ఎలాగూ తెలుగులో వెబ్ సీరీస్ ల హవా బాగానే ఉంది. అందుకే తేజస్వి ఇక వాటికి కూడా సై అంటుందని తెలుస్తుంది. 

 

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ రాకున్నా సరే తేజస్వి మాత్రం వెబ్ సీరీస్ ల ద్వారా కూడా ఎంతో కొంత వెనుకేసుకోవాలని చూస్తుంది. మహేష్ తో ఒక డైలాగ్ ఆమెకు ఈ రేంజ్ తీసుకొచ్చింది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్నీ చేసుకుంటూ వెళ్తుంది అమ్మడు. ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తా అంటున్న తేజస్వి గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కమిట్మెంట్ సినిమాలో తేజస్వి హాట్ షో సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.             

మరింత సమాచారం తెలుసుకోండి: