సాధార‌ణంగా టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు విడుద‌ల అవుతున్నాయి అంటే ఎంత హ‌డావుడి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కులు ఆ సినిమాల‌పై భారీ అంచ‌నాలు పెట్టుకుంటారు. ఇక‌ కొన్ని సినిమాలు వారి అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఉహించినంత రెంజ్ లో ఉండకపోవడంతో ప్లాప్ లుగా మిగిలిపోతాయి. అయితే వెండితెర‌పై ఫేల్ అయిన సినిమాలు కూడా బుల్లితెర పై సూప‌ర్ హిట్ కొట్టి ఇప్పటి కి రికార్డు లు క్రియేట్ చేస్తూ నే ఉన్నాయని చెప్పొచ్చు.

IHG

సినిమా లను కొన్న ఛానెల్ కి లాభాలు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా కూడా ఒక‌టి.  హరీష్‌ శంకర్‌ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. కానీ, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. వాస్త‌వానికి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుండి చెప్పాలంటే అన్ని అవాంతరాలే.

IHG

 బ్రాహ్మణ సంఘాల గొడవలు, ఇందులో కొన్ని పదాలని తొలగించాలని పట్టుదలలు, వీటన్నిటిని తట్టుకొని దర్శక నిర్మాతలు సినిమా ని పూర్తి చేసి విడుదల చేశారుగాని.. అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. కమర్షియల్ ఫార్ములాతో హిట్ కొట్టడానికి చాలా ప్రయత్నిచారు కానీ వర్కౌట్ అవ్వలేద‌నే చెప్పాలి. కానీ, బుల్లితెర‌పై మాత్రం ఈ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. 2017లో ఫ‌స్ట్ టైమ్‌ టీవీలో టెలీకాస్ట్ అయిన‌ దువ్వాడ జగన్నాథం 21.70 భారీ టీఆర్సీ రేటింగ్ సాధించింది. ఇక ఆ త‌ర్వాత కూడా భారీ స్థాయిలో రేటింగ్స్ సాధించింది. మ‌రోవైపు యూట్యూబ్‌లోనూ ఈ సినిమా భారీ వ్యూస్ సంపాధించుకుంది. అలా వెండితెర‌పై ఫేల్ అయిన‌ బ‌న్నీ సినిమా బుల్లితెర‌పై సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: