బాలక్రిష్ణ. నందమూరి అందగాడు, టాలీవుడ్ సీనియర్లలో టాప్ రేంజి హీరో. బాలయ్య ఈ తరం హీరోలలో మెగాస్టార్ తరువాత వంద సినిమాలు పూర్తి చేసిన క్రెడిట్ సొంతం చేసుకున్నాడు. బాలయ్య అటు మాస్, ఇటు క్లాస్ మూవీస్ ఎన్నో చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇపుడున్న ఏ హీరోకూ లేని రికార్డు బాలయ్యకు ఉంది. ఆయన పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో కూడా నటించాడు.

షష్టి పూర్తిని ఈ మధ్యనే చేసుకున్న బాలయ్య ఇంకా యువకుడే. ఆయనకు షూటింగ్ అంటే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. అయితే ఇపుడు కరోనా టైం కాబట్టి ఏం బాలేదు, మళ్లీ ఏ మాత్రం తగ్గినా తాను దూకేందుకు రెడీ. అయితే బాలయ్య ఈ లాక్ డౌన్ టైంలో తన సినిమాలు, కెరీర్ గురించి పెద్దగా ఆలోచించడంలేదుట.

ఆయన ఆలోచనలు అన్నీ కూడా మోక్షజ్ఞ చుట్టే తిరుగుతున్నాయట. కుమారుడు హీరో కావాలి. నందమూరి వంశం మూడవతరంలో టాప్ రేంజికి చేరుకోవాలి. దీని మీదనే బాలయ్య గట్టి పట్టుదలగా ఉన్నాడుట. అయితే మోక్షజ్ఞ మాత్రం ఫిజిక్ మెయింటెయెన్సే సరిగా చేసుకోవడం లేదు. ఆయనకు నటన అంటే ఇష్టం లేదని అంటున్నారు.

అదే కనుక నిజం అయితే బాలయ్య ప్రయత్నాలు  వేస్టే. కానీ బాలయ్య గట్టి పట్టుదల మీద ఉన్నాడుట. తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో హీరోగా చేయాలనుకుంటున్నాడుట. అందుకోసం ప్రత్యేకంగా ఫిట్ నెస్ కోసం కూడా శిక్షణ ఇప్పిస్తున్నాడుట. అదే టైంలో నటనలో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని టాక్.

ఇక బాలయ్య  తన కుమారుడిని 2021లో హీరోగా ఎంట్రీ ఇప్పించాలని తెగ ఉత్సాహం పడుతున్నారు. దానికి తగినట్లుగా డైరెక్టర్ల నుంచి స్టోరీస్ ఆయనేఫోన్ ద్వారానే  వింటున్నారుట. వాటిలో మంచిది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే  కరోనా తగ్గిన తరువాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి నందమూరి నట సింహం ఇపుడు కొడుకు కెరీర్ మీద బెంగతోనే హడావుడి పడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: