అవును మీరు విన్నది నేను అన్నది నిజమే.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే అది ఏ సినిమా? అక్కడ ఎన్ని కోట్లు వసూలు చేసింది? అక్కడ హీరో ఎవరు? ఇలాంటి విషయాలు ఇపుడు మన సమీక్షలో చూద్దాం..

అయితే ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసిన మూవీ "ఆర్టికల్ 15" అక్కడ సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన సినిమా దాదాపుగా రూ 70 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కాస్ట్ వ్యవస్థ మీద తక్కువ జాతి వాళ్ళు సమాజంలో ఎదురుకునే పరిస్థితుల మీద తెరకెక్కిన సినిమా, అసలు ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ లో మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా.. ఇపుడు ఈ సినిమా తెలుగులో అడివి శేష్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన శేష్ ఇపుడు ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.. 

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. "క్షణం", "అమీ తుమీ", "గూఢచారి" మరియు "ఎవరు" సినిమా లతో నాన్ స్టాప్ హిట్స్ కొడుతూ దూసుకు పోతున్న అడవి శేష్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉండ గా అందులో ఒకటి "గూఢచారి" సినిమా సీక్వెల్ కాగా మరొకటి ప్రస్తుతం చేస్తున్న మేజర్ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: