ప్రముఖ హీరోయిన్ మాధవీ  లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రోపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా లేడీ. ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోస్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఒకే ఒక క్యారెక్టర్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా దర్శకుడు కళ్యాణ్ తెలిపాడు.
 అలానే ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. ఈ సినిమాకి మాధవీ లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు.

ఇక పోతే మాధవీ  లత గతం లో రవి బాబు దర్శకత్వం వహించిన నచ్చావులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తనీష్ హీరో గా నటించాడు. అప్పటి దాకా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తనీష్ కి కూడా ఈ సినిమా మొదటి సినిమా.   తర్వాత చిన్న హీరోయిన్ గా కొన్ని మూవీస్ లో చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అవకాశాలు తగ్గడం తో కాస్టింగ్ కౌచ్ వివాదాలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఈమె అందమైన నటి మాత్రమే కాదు మంచి మాటకారి కూడా. ఈ మధ్య పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ చాలా సార్లు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో చిక్కుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: