ఎం.ఎం.కీరవాణి.. టాలీవుడ్ లో గొప్ప సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు అందరు సరస్వతీ పుత్రుడు అంటారు. కీరవాణి కి వృత్తే దైవం. అందుకే బాహుబలి లాంటి భారీ చిత్రానికి సంగీతమందించాడు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన జీ.ఎస్.టి కి బ్యాక్‌గ్రౌడ్ స్కోర్ అందించాడు. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. ఇక కీరవాణి ముందు నుంచి ఎలాంటి సినిమాకి పనిచేసిన ఆయన మార్క్ ఖచ్చితంగా ఉంటుంది.

కీరవాణి గురించి దేశం మొత్తం ఎంతో గర్వంగా చెప్పుకునేలా బాహుబలి సినిమా రెండు భాగాలకి సంగీతమందించి బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించిందంటే అందులో కీరవాణి పాత్ర చాలా ఉందని చెప్పాలి. ఇప్పుడు కూడా దర్శకుడు ధీరుడు తెరకెక్కిస్తున్న మరో భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ కి సంగీతమందిస్తున్నారు. ఇక ఈ సినిమా కి సంగీతం ఎలా ఉంటుందో ఇంతక ముందు రాం చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజు ని రివీల్ చేసిన వీడియో టీజర్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే అర్థమవుతుంది.

అందుకే ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ కే పోటీగా దిగుతున్నారని చెప్పుకుంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా ప్రభాస్ నటించబోతున్న “ఆదిపురుష్” రూపొందబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా... బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ భారీ చిత్రానికి సంగీతం ప్రధాన పాత్ర పోషించనుంది. అందుకే ఈ సినిమాకి యూనివర్సల్ మ్యూజి డైరెక్టర్ ని ఎంచుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అలాగే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా రూపొందించబోతున్నాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్ గా నటించబోతుంది. కాగా ఈ సినిమాకి యూనివర్సల్ గా క్రేజ్ ఉన్న మ్యూజి డైరెక్టర్ ని ఎంచుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ రెండు భారీ సినిమాలకి ఏ.ఆర్.రెహమాన్ పేరు పరిశీలనలో ఉండగా ఆయనకి పోటీగా ఎం.ఎం.కీరవాణి నిలిచాడు. రెహమాన్ ని ఎంతగా అనుకుంటున్నారో కీరవాణి గురించి అంతే గొప్పగా భావిస్తున్నారట. మొత్తానికి కీరవాణి రెహమాన్ కి భారీగా పోటీ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: