సౌత్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని కోడలిగా సమంత క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. పెళ్లి తర్వాత కామన్ గా అయితే హీరోయిన్స్ కు డిమాండ్ తగ్గుతుంది. కాని సమంతకు మాత్రం డిమాండ్ తగ్గడం కాదు కదా పెరుగుతూ వస్తుంది. పెళ్ళి తర్వాత కమర్షియల్ సినిమాలకన్నా ప్రయోగాత్మక సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక లేటెస్ట్ గా సమంత ఓ ఎక్స్ పెరిమెంట్ సినిమా చేయాలని చూస్తుందట.

సమంత చేస్తున్న ఈ ప్రయత్నం ఆమె ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందని టాక్. అదెలాగా అంటే సమంత మూగ అమ్మాయి పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో సమంత తన సత్తా చాటుతుందని తెలుస్తుంది. గేం ఓవర్ డైరక్టర్ అశ్విన్ శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. అతను చెప్పిన కథ బాగా నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

తాప్సీ తో గేమ్ ఓవర్ సినిమా చేసిన అశ్విన్ సెకండ్ మూవీగా సమంతను డైరెక్ట్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయట. సినిమాలో సమంతతో పాటుగా పేరున్న నటీనటులే చేస్తారని తెలుస్తుంది. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలుస్తాయి. సినిమాలతో పాటుగా యాడ్స్, కొత్తగా ఓ క్లాత్ బ్రాండింగ్ కూడా మొదలుపెట్టిన సమంత పర్ఫెక్ట్ కెరియర్ ప్లానింగ్ లో ఉందని చెప్పొచ్చు.                                                                          
 

మరింత సమాచారం తెలుసుకోండి: