టాలీవుడ్ లో రాజ్ తరుణ్ పరిస్థితి ఏ హీరో కి లేదనే చెప్పాలి.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరో ఇప్పుడు బిలో యావరేజ్ హీరో గా కూడా లేకపోవడం అంతటా చర్చనీయంశం అయ్యింది..ఆ సినిమా హిట్ లతో రాజ్ తరుణ్ టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ అందరి అంచనాలు తారుమారు అయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.. తొలి సినిమా ఉయ్యాలా జంపాల తో ఎవరీ కుర్రాడు ఇంట్రెస్టింగ్ ఉన్నాడు అనుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ తో సాలిడ్ హిట్ కొట్టి కుర్రాడు మంచి పోటీ ఇచ్చేలా ఉన్నాడు అనుకున్నారు.. ఇక కుమారి 21F తో కుర్రాడు కాదు టాప్ హీరో అవుతాడు అన్నారు.. కానీ సరిగ్గా మళ్ళీ మూడు సినిమాలు చేశాక కానీ రాజ్ తరుణ్ స్టఫ్ ఏంటో తెలుసుకోలేకపోయారు..

తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. అయితే ఒరేయ్ బుజ్జిగా సినిమా ని OTT లో రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అన్నది అయన అభిమానుల మాట.. వచ్చిన హిట్ ని సద్వినియోగం చేసుకోలేక చెత్త సినిమాలు చేసి వచ్చిన స్టార్ డమ్ ని చేజేతులా పోయేలా చేసుకున్నాడు అనేవారు ఉన్నారు.. ఇక ఈ సినిమా ఫ్లాప్ రాజ్ తరుణ్ సినిమాలపై చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు..

ఇప్పటికే రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా నిర్మాత అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోయేలా వుంది.. అలాగే నాగ చైతన్య నిర్మించబోయే సినిమా కూడా ఆపేయాలని చైతు నిర్ణయించుకున్నాడట..నాగ చైతన్య తమ అన్నపూర్ణ, మనం ఎంటర్‍టైన్‍మెంట్స్ కి సంబంధం లేకుండా స్వయంగా ఒక నిర్మాణ సంస్థ మొదలు పెడుతున్నాడని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. భారీ చిత్రాలు కాకుండా ఒక లో బడ్జెట్‍ సినిమాతో చైతన్య సంస్థ మొదలవుతుందని, మొదటి సినిమాలో రాజ్‍ తరుణ్‍ హీరోగా నటిస్తాడని కూడా న్యూస్‍ వచ్చింది. ఒరేయ్‍ బుజ్జిగా క్లిక్‍ అయినట్టయితే ఈ చిత్రం చేసి వుండేవాడో లేదో తెలియదు కానీ ఇప్పుడయితే రాజ్‍ తరుణ్‍తో సినిమా చైతన్య డ్రాప్‍ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్నిర్మాత కాపాడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: