నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. మోక్షజ్ఞ సినిమా తర్వరలోనే ఉంటుందని, దానికి బాలయ్య దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. నర్తనశాల ఓటీటీ విడుదలకు, మోక్షజ్ఞ సినిమాకు లింకు పెట్టి వార్తలు రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంతరీ నర్తనశాలకు మోక్షజ్ఞ సినిమాకు సంబంధం ఏంటి..?
బాలకృష్ణ తొలిసారి దర్శకత్వం చేసిన సినిమా నర్తనశాల. ఆ సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకునేవారు బాలయ్య. అయితే సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే బాలయ్య, అదే నెగెటివ్ సెంటిమెంట్ తో నర్తనశాలను కొన్నేళ్లుగా పక్కనపెట్టేశారు. నర్తనశాల సినిమా మొదలైన కొన్ని రోజులకే యాక్సిడెంట్ లో హీరోయిన్ సౌందర్య మృతిచెందింది. అప్పట్నుంచి ఆ సినిమా అలా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు శ్రీహరి కూడా మరణించారు. ఈ సినిమాలో అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు.
ఇప్పుడు ఆ పాత ఫుటేజీని కలెక్ట్ చేసి ఎడిటింగ్ చేస్తే 17 నిముషాల వీడియో తయారైంది. దీన్ని దసరా సందర్భంగా శ్రేయాస్ ఓటీటీ ద్వారా విడుదల చేస్తామంటున్నారు బాలయ్య. స్వీయ దర్శకత్వంలో బాలయ్య నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఇన్నాళ్లకు ఓటీటీ ద్వారా బైటకొస్తుందనమాట. ఈ సినిమాతో బాలయ్య దర్శకత్వ ప్రతిభ బైటకొస్తుందని, అదే ఉత్సాహంతో కొడుకుతో మంచి పౌరాణిక సినిమాని బాలయ్య అనౌన్స్ చేస్తారని చెబుతున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ పౌరాణిక పాత్ర ద్వారానే ఉండాలనేది బాలకృష్ణ ఆశ. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామాయణం ద్వారా రాముడిగా అలరించి ఆ తర్వాత ఇండస్ట్రీలో తాతకు తగ్గ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అదే రూట్ లో వెళ్తే.. పౌరాణిక పాత్రలు తన కొడుక్కి కూడా కలిసొస్తాయనేది బాలయ్య లాజిక్. సో.. మోక్షజ్ఞ పౌరాణిక సినిమాకి బాలయ్యే దర్శకత్వం వహిస్తారని కూడా తెలుస్తోంది. మొత్తమ్మీద నర్తనశాల విడుదలతో మోక్షజ్ఞ ఎంట్రీ.. అది కూడా బాలయ్య దర్శకత్వంలో అనేది కన్ఫామ్ అవుతోందనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: