బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదలైన క్యాస్టింగ్ కౌచ్ వివాదం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని  ప్రకంపనలు సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్లు తమ కెరియర్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకు తెస్తూ సంచలనాలు సృష్టించారు అని చెప్పాలి. కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది  అనుకునేలోపే  ఇప్పటికీ కూడా కొంతమంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.


 తాజాగా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసింది దంగల్ బ్యూటీ పాతిమా సనా  షేక్. అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్  సినిమాలో  గీతా ఫోగట్ పాత్రలో నటించిన sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అవకాశాలు అంతగా రాకపోవడంతో తాను కూడా హీరోయిన్ పీస్  అని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఈ కుర్ర నటి. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ ఫోటో షూట్లతో హీటెక్కిస్తూ  ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తనకు షారుఖ్ ఖాన్ సినిమాలో  అవకాశం ఇవ్వాలి అంటూ ఏకంగా దర్శకుడిని కూడా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



 తాజాగా sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఇండస్ట్రీలో బాల నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోవడానికి మాత్రం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం ఎన్నో  ఆఫీసుల చుట్టూ తిరిగిన  అవమానాలు ఎదురయ్యాయని.. అంతే కాకుండా ఎంతోమంది తనను కమిట్మెంట్ కూడా అడిగేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగం కావాలంటే క్వాలిఫికేషన్ ఎలాగో హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ అలాంటిది అని తనతో చాలా మంది చెప్పారు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విషయం కూడా చెప్పు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అందరిలో  అవగాహన రావడం వల్లే లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటికి చెబుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: