మెగా ఫ్యామిలి నుంచి వారసులొచ్చారు. హీరోలుగా రాణిస్తున్నారు.
అక్కినేని వారసులు కూడా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్నారు.
దగ్గుబాటి వారి వారసుడు
రాణా కూడా హీరోగా, నటుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇలా హీరోల వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోలుగా రాణిస్తున్నారు. కానీ
నందమూరి తారకరామారావు గారి వారసుడుగా అడుగుపెట్టి, స్టార్ హీరోగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న
బాలకృష్ణ మాత్రం తన వారసుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదు.
బాలకృష్ణ తనయుడు
మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని
నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య
బాలకృష్ణ నటించిన
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో
మోక్షజ్ఞ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ సినిమీ రిలీజయ్యాక అభిమానులు నిరాశ చెందారు. ఆ తర్వాత
బోయపాటి శ్రీను దర్శకత్వంలో
మోక్షజ్ఞ సినిమా లాంచ్ అవుతుందని ప్రచారం జరిగింది. దీని గురించి
బాలకృష్ణ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మోక్షజ్ఞ యాక్టింగ్ నేర్చుకుంటున్నారని,
బోయపాటి శ్రీను
సినిమా కోసం వర్కవుట్ లు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అభిమానులు కూడా
మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని ఆశతో ఉన్నారు.

ఈ క్రమంలో
మోక్షజ్ఞ అభిమానుల్లో నిరాశ మిగిల్చారు. ఇటీవల
నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు
బాలకృష్ణ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో
మోక్షజ్ఞ ఫిట్ నెస్ గా లేకుండా, లావుగా కనబడ్డారు. గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే
బాలకృష్ణ మాత్రం, తన పుట్టినరోజు నాడు
మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్ గానే ఉంటుందని, స్క్రిప్ట్ కూడా పక్కన పెట్టానని, అన్నీ కుదిరినప్పుడు లాంచింగ్ ఉంటుందని, దానికి టైమ్ పడుతుందని అన్నారు. కానీ ఆ టైమ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళలో కొవ్వొత్తులు వేసుకుని చూస్తున్నారు. కానీ
మోక్షజ్ఞ మాత్రం
హీరో ఫిట్ నెస్ తో కాకుండా సాదాసీదాగా కనబడుతుండడంతో
నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఒక పక్క మిగతా హీరోల వారసులు ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే,
మోక్షజ్ఞ కూడా త్వరగా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కంగారుపడుతున్నారు. మరి
బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలో త్వరగా
సినిమా అనౌన్స్ చేస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. ఇక
నందమూరి వంశం నుంచి
హరికృష్ణ వారసుడైన
జూనియర్ ఎన్టీఆర్ తక్కువ వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.