తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో గూఢచారి116 ఒకటి.. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయాన్ని సాధించింది.. అయితే ఈ సినిమాకి సంబంధించి తెరవెనుక చాలా పెద్ద కథే నడిచిందట..ఈ సినిమాకు సంబంధించి కొన్ని నమ్మలేని విషయాలు బయటికొచ్చాయి..వాటిని ఒకసారి పరిశీలిద్దాం.." అప్పట్లో ఎలుక ద్వారా ఓ వైరస్ సృష్టించి ప్రపంచాన్ని అంతం చేయాలనుకునే శాస్త్రవేత్తను తుదముట్టించి కథతో వచ్చిన ఓ ఎస్ ఎస్ 117పానిక్ ఇన్ బ్యాంకాక్ మూవీ మద్రాసులో విడుదలైనపుడు చూసిన నిర్మాతలు భారతీయతకు అందునా తెలుగుకి తగ్గట్టుగా మంగళగిరి మల్లికార్జునరావు డైరెక్షన్ లో గూఢచారి 116గా మలిచారు. విదేశీయులు భారత్ పై చేసే కుట్రను తిప్పికొట్టే అధికారి పాత్రగా గూఢచారి 116రూపొందించారు.

నిజానికి తేనెమనసు లుతో పరిచయమైనా కృష్ణ రెండవ మూవీ కన్నె మనసులు చేస్తున్న సమయంలోనే కృష్ణకు గూఢచారి 116లో ఛాన్స్ వచ్చింది.అప్పటివరకూ ఇలాంటి సాహస సన్నివేశాలతో కూడిన సినిమాలు రాకపోవడంతో కృష్ణ జేమ్స్ బాండ్ మూవీస్ కి బ్రాండ్ ఇమేజ్ గా మారాడు. కృష్ణతో డూండి 25సినిమాలు తీయడానికి ఈ మూవీ దోహదం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని సమయంలో గూఢచారి116మూవీ ని అద్భుతంగా తెరకెక్కించారు. కృష్ణ, మల్లికారుజనరావు కాంబోలో 13మూవీస్ వచ్చాయి. జేమ్స్ బాండ్ మూవీని తెలుగులోకి స్క్రిప్ట్ గా మలచడంలో రచయిత ఆరుద్ర మంచి చాకచక్యం కనబరిచారు. ఈ మూవీని హిందీలోకి అనువదిస్తే, రచయిత సరిగ్గా ఆరుద్రనే అనుసరించారు. రొమాన్స్, వినోదం, సాహస పోరాటాలు అన్నీ కలగలిసిన ఈ మూవీలో పాత్రల తీరుని మలచిన తీరు అద్భుతం.

ఈ మూవీలో మొదట్లో కొంతసేపు కనిపించే ఏజంట్ 303పాత్రను శోభన్ బాబు వేశారు. కీలక విషయాలు పరిశోధించి అందించేక్రమంలో మరణిస్తాడు. వీరాభిమన్యులో మంచి పాత్ర ఇచ్చిన నిర్మాతలు ఈ మూవీలో చిన్నపాత్ర ఇవ్వడానికి కారణం శోభన్ బాబు సాంఘికానికి పనికొస్తాడా రాడా అనే సందేహమే. అయితే ఇంతచిన్న పాత్ర ఇచ్చినందుకు శోభన్ బాబు చాలా బాధపడ్డారట. మిమిక్రి కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కూడా ఇందులో నటించడమే కాదు, ఆ పాత్ర కూడా మిమిక్రి కళాకారుని పాత్ర కావడం విశేషం.కన్నె మనసులు, గూఢచారి 116ఒకేసారి షూటింగ్స్ వలన అక్కడ స్టిల్స్ ఇక్కడ, ఇక్కడి స్టిల్స్ అక్కడ ప్రదర్శించడంతో కృష్ణను డైరెక్టర్స్ మందలించారట. ఓ ఇంటర్యూలో కృష్ణ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం అనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: