నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం మీద ఎప్పుడూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అప్పుడెప్పుడే శాతకర్ణి సినిమాలోనే నందమూరి వారసుడి ఎంట్రీ కన్ ఫాం అంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ లో కూడా మోక్షజ్ఞ కెమియో రోల్ ఉంటుందని అన్నారు ఇవేమి జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ బాలయ్య బాబు ఊరిస్తున్నా ఆ టైం కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ గా బాలయ్య తన వారసుడి మొదటి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ చేతిలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞని పెడుతున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా పూరీతో చేయించడానికి బలైన రీజన్ ఏంటంటే.. చిరు తనయుడు చిరుతగా ఎంట్రీ ఇచ్చి రంగస్థలాన్ని ఏలేస్తున్నాడు. మెగాస్టార్ అప్పుడు పెట్టిన నమ్మకం ఇప్పుడు బాలయ్య బాబు పెడుతున్నట్టు తెలుస్తుంది.  

చిరుతతో పూరీ డైరక్షన్ లో రాం చరణ్ ను ఎంట్రీ ఇప్పించాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు కూడా మోక్షజ్ఞ కోసం పూరీని నమ్ముకున్నాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ సూపర్ ఫాం లోకి వచ్చిన పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరీ, మోక్షజ్ఞ మూవీ ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. అసలైతే బాలకృష్ణ మోక్షజ్ఞ మొదటి సినిమాను క్రిష్ డైరక్షన్ లో చేస్తాడని అనుకున్నారు కాని సీన్ లోకి పూరీ వచ్చాడు. మోక్షజ్ఞ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: