దేశంలోనే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేసే సత్తా టాలీవుడ్ కి ఉంది. అలాగే హెవీ బడ్జెట్ మూవీస్ ఇక్కడ నుంచే వస్తాయి. అలాగే కలెక్షన్ల దుమ్ము దులపాలన్నా కెరాఫ్ అడ్రెస్ గా టాలీవుడ్ నే చెప్పుకుంటారు. అటువంటి టాలీవుడ్ ఈ మధ్య బాలీవుడ్ నే మించుతోంది. క్వాలిటీతో పాటు కలెక్షన్లలో కూడా పోటీ పడుతోంది.

ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు దాదాపుగా రెండు వందల దాకా సినిమాలు ఒక ఏడాదిలో తయారయ్యేవి. టాలీవుడ్ లో అలనాటి టాప్ హీరోలు ఎన్టీయార్, అక్కినేని,  శోభన్ బాబు వంటి వారు ఏడాదికి అరడజన్ తక్కువ కాకుండా సినిమాలు చేసేవారు. క్రిష్ణ అయితే ఏడాదికి ఎపుడు డజన్ చేసేవారు. అంటే నెలకు ఒకటి అన్న మాట.

అటువంటి  హిస్టరీ ఉన్న టాలీవుడ్ లో స్టార్ హీరోలు బాగా సినిమాలు తగ్గించేశారు. ఏడాదికి ఒక సినిమా వస్తే గగనం అన్నట్లుగా సీన్ ఉంది. అయితే కరోనా వచ్చి మొత్తం సీన్ మార్చేసింది. ఇపుడు టాలీవుడ్ హీరోలు చమటోడుస్తున్నారు. వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. టాలీవుడ్ కి మళ్లీ గత వైభవం తీసుకురావాలని ఆరాటపడుతున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూస్తే చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. తమ్ముడు పవర్ కళ్యాణ్ అయితే ఆరు సినిమాలు క్యూ లో ఉంచారు. ఇక రామ్ చరణ్ రెండు సినిమాలు సెట్స్ మీద ఉంటే మరో రెండు సినిమాలు రెడీ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తూనే కొరటాల శివతో సినిమాతో పాటు, మరో సినిమాను రెడీ చేశారు.

ఇక బాలక్రిష్ణ తీసుకుంటే బోయపాటి మూవీ ఉండగానే మరో సినిమాను క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. మరో రెండు కూడా రెడీ చేస్తున్నారు. నాగార్జున‌ చేతిలో మూడు, వెంకటేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట. జూనియర్ ఎన్టీయార్ కూడా వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు.  ప్రభాస్ అయితే నాలుగు సినిమాలతో బిజీగా ఉంటే మహేష్ బాబు కూడా సర్కార్ వారి పాట తరువాత మరో రెండు సినిమాలను రెడీ చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి మన హీరోలు బాగా కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: