యువ హీరో శర్వానంద్ తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంటాడు. చేసే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా అతను మాత్రం ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. జాను తర్వాత శ్రీకారం తో రాబోతున్నాడు శర్వానంద్. నూతన దర్శకుడు కిశోర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. భలే గుంది బాలా సాంగ్ తో పాటతో సినిమాపై క్రేజ్ తెచ్చిన శర్వానంద్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్, ఇంజినీర్ కొడుకు ఇంజినీర్ అయినప్పుడు రైతు కొడుకు మాత్రమే రైతు ఎందుకు అవ్వట్లేదని వాయిస్ ఓవర్ వస్తుంది. తనకు ఇప్పటికి అర్ధంకాని ప్రశ్న అదే అని హీరో శర్వానంద్ అంటాడు. తినే వాళ్లు నెత్తి మీద జుట్టు అంత ఉంటే పండించే వాళ్లు మూతి మీద మీసం అంత ఉంటున్నారు.. అంటూ శ్రీకారం కొత్త సంకల్పానికి అని కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు శర్వానంద్. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు పెద్దగా హడావిడి చేయకపోయినా శర్వానంద్ సినిమాలో విషయం ఉందని అనిపిస్తుంది.

చూస్తుంటే శ్రీకారంతో శర్వానంద్ సూపర్ హిట్ కు కూడా శ్రీకారం చుడతాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నాని గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంకా అరుల్ మోహన్ నటించింది. సినిమాలో పాట ఇప్పటికే హిట్ అవ్వగా మార్చ్ 11న ఈ సినిమా రిలీజై ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. తప్పకుండా శర్వానంద్ శ్రీకారం ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.  శర్వానంద్ కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ ఫిడెన్స్ తో ఉన్నాడు. శతమానం భవతి లానే విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ కథ శర్వానంద్ కు ఆ సినిమా హిట్ రిపీట్ అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: