నితిన్ఫిబ్రవరి మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆయనకి సూపర్ హిట్ ఇచ్చిన ఇష్క్ ఈ నెలలోనే విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో. భీష్మ కంటే ముందు నితిన్‌ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్‌ తీసుకొన్న నితిన్‌.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి  చెక్‌. భీష్మతో పాటు చెక్‌ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్‌  తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్‌ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్‌’పై నితిన్‌ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్‌ మరో హిట్‌ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్‌ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అనుకునంత రేంజ్ లో లేవు అని ట్రేడ్ మాట్లాడుకుంటుంది. అలాగే ఇంకొక టాక్ కూడా బాగా నడుస్తుంది అదేంటి అంటే చంద్ర శేఖర్ యేలేటి గారు కమర్షియల్ సినిమాలు నడుస్తున్న టైం లో కంటెంట్ ఉన్న సినిమాలు తీసి కంటెంట్ సినిమాలు నడుస్తున్న ఈ టైం లో కమర్షియల్ సినిమా తీసాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా కూడా ఆవేరేజ్ టాక్ తోనే నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: