అందరి హీరోల వారసులూ ఇండస్ట్రీ ప్రవేశం చేస్తున్నారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఇప్పటికీ తెర వెనకనే ఉన్నాడు. అతనే నందమూరి మోక్షజ్ఞ. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది పక్కా అంటున్నారు. అది కూడా బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10న ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో బాసరలో ఫ్యామిలీ మెంబర్స్ తో  కలసి మోక్షజ్ఞ మెరిసిన ఒక స్టిల్ మాత్రం ఇపుడు అభిమానులను తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారుట. మోక్షజ్ఞ లుక్ కాస్తా డిఫరెంట్ గా ఉండడం, ఆయన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని కంట్రోల్ లో పెట్టినట్లుగా కనిపిస్తుండడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ గా ఉన్నారుట. బాలయ్య మంచి సమయం చూసుకుని ఇక కుమారుడి సినిమాను లాన్ చేయడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇప్పటికే బాలయ్య కొడుకు తొలి సినిమా కోసం  అనేకమైన  కధలు వింటున్నాడు అంటున్నారు. ఇక డైరెక్టర్లు ఎవరు అంటే ఓ వైపు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కనిపిస్తున్నారు. అలాగే ఇంకో వైపు డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూడా లైన్ లో ఉన్నాడు అంటున్నారు.

వీరితో పాటు క్రిష్ కూడా బాలయ్య కుమారుడిని లాంచ్ చేసే చాన్స్ తీసుకుంటాడు అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఫ్యాన్స్ కి మాత్రం కాస్తా ఆశ కలిగించేలాగానే ఈసారి మోక్షజ్ఞ  ఫోటోలు ఉండడంతో ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇంకో వైపు చూస్తే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎలా ఉంటుంది ఏ జానర్ లో చేస్తాడు అన్న దాని మీద కూడా చర్చలు సాగుతున్నాయి. క్రిష్ తో మూవీ అయితే కచ్చితంగా హిస్టారికల్ మూవీ అవుతుంది అంటున్నారు. అలాగే బోయపాటి అయితే స్టార్ హీరో ఇమేజ్ ని తెచ్చే మాస్ కంటెంట్ తో ముందుకు వస్తాడని చెబుతున్నారు. ఇక పూరీ జగన్నాధ్ అయితే హీరో వర్షిప్ ఫస్ట్ మూవీతోనే వచ్చేలా కధ డిజైన్ చేసి రెడీగా ఉన్నారని కూడా అంటున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: