వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కుర్రాడిని చంపి పోలీస్ స్టేషన్ లో పాతి పెడతాడు. పోలీస్ స్టేషన్ ఉన్నంతవరకు తనని ఎవరు పట్టుకోలేరన్న ధీమాతో వెంకటేష్ కనిపిస్తాడు. అచ్చం ఇలాంటి సీనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.దృశ్యం సినిమానే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టారో తెలియదుగాని పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా అస్తిపంజరం బయటపడడంతో పోలీసులు ఎంతో షాక్ అయ్యారు. అయితే అస్తిపంజరం ఎవరిది?ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు పూర్తి వివరాల్లోకి వెళితే...

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఖటోదర పోలీస్ స్టేషన్ ఉంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిపోయే జనాలతో ఎంతో బిజీగా ఉంటుంది. అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా సీజ్ చేసిన వాహనాలను ఒకవైపు ఉండగా అవన్నీ తుప్పుపట్టి పాడై పోతున్నాయని గ్రహించిన పోలీసులు వాటిని అక్కడ నుంచి తొలగించాలని భావించారు. మరి కొన్ని వాహనాలు అయితే ఏకంగా భూమిలోపలికి కూరుకుపోయాయి.ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాహనాలను తొలగిస్తున్న క్రమంలో పోలీసులకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం బయటపడింది. భూమి లోపల నుంచి ఒక అస్తిపంజరం, పుర్రె బయటపడటంతో పోలీసులు ఎంతో షాక్ అయ్యారు.

ఆ విధంగా పోలీస్ స్టేషన్లు అస్తిపంజరం బయటపడటంతో అందరికీ ఒక్కసారిగా దృశ్యం సినిమా కళ్ళముందు కనిపించింది. అసలు ఈ పుర్రె ఇక్కడికి ఏ విధంగా వచ్చింది. ఎన్ని రోజుల క్రితం దీనిని పాతి పెట్టారు? అసలేం జరిగింది అనే విషయాలను తెలుసుకోవడం కోసం ఆ అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు.అయితే అదే స్టేషన్ లో కాకుండా ఇతర స్టేషన్ పరిధిలో కూడా ఎవరైతే మిస్సింగ్ కేసులు ఉన్నాయో వాటన్నింటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ విధంగా అస్థిపంజరం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: