దంగల్ సినిమా లో హీరోయిన్ గా నటించిన ఫాతిమా సనా షేక్. ఈమె ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూసిన వారందరూ ఈమె ను  మెచ్చుకోక తప్పదు. అంతలా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అనే సమస్య ఈరోజుది కాదు.. గత కొద్ది సంవత్సరాల నుండి కాస్టింగ్ కౌచ్, మీటూ వంటి పేర్లతో ఎప్పటినుండో వినిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇది.. ఇక దీనిలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం చిక్కుకున్న రోజులను మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు సరికొత్తగా ఈ విషయంపై దంగల్ నటి కూడా స్పందించింది. అయితే ఆమె చెప్పిన విషయాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


పూర్తి వివరాల్లోకి వెళితే , నటి sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ పై కూడా సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా నిజ జీవితంలో కూడా దాడి జరిగిందట. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.." గతంలో నేను ఒకసారి జిమ్ కు  వెళ్లి తిరిగి వస్తుండగా, ఒక వ్యక్తి నన్ను అదే పనిగా చూస్తున్నాడు. ఆ తర్వాత నన్ను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. అలా చాలా తేడాగా చూస్తుండడంతో.. ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు. ఏం చూస్తున్నావు అని అడిగాను. అందుకు అతను సమాధానంగా  నా ఇష్టం. నేను చూస్తాను. నీకెందుకు? అని అనడంతో అతని చెంప మీద కొట్టాను.


ఇక దాంతో అతను కూడా నా ముఖం పై గట్టిగానే కొట్టాడు. ఇక దెబ్బకు నేను కింద పడిపోయాను. ఆ తర్వాత లేచి మా నాన్నగారికి ఫోన్ చేసేలోపు అతను అక్కడి నుండి పారిపోయాడు. ఇక ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను". అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమలో కూడా నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇంకా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలోని కొంతమంది దర్శకులు పడుకుంటేనే అవకాశాలు ఇస్తామంటూ చెప్పారు. ఇక నేను నిర్మొహమాటంగా కుదరదు అని చెప్పడంతో నాకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారు..


ఇక అంతే కాకుండా మరికొంత మంది నన్ను శారీరకంగా లొంగతీసుకోవాలని కూడా ట్రై చేశారు.. నాకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చాను అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది ఫాతిమా..


మరింత సమాచారం తెలుసుకోండి: