సినీ ఇండస్ట్రీలో కరోనా  వ్యాప్తి చెందడం ద్వారా పలు సినిమాలు ఆగిపోయాయి. దాదాపు ఒక ఆరు నెలల పాటు సినిమా షూటింగులు జరగలేదు. ఇక సినిమా హాల్ లో సందడి కూడా లేదు. ఇదిలాఉంటే కరోనా తగ్గు ముఖం పట్టిన   తర్వాత తిరిగి థియేటర్ లో ఎంత ఉత్సాహంతో తెరుచుకోబడ్డాయి. ఇక ఈ సందర్భంగా   ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే మరి కొన్ని విజయం సాధించాయి. అయితే ఆ ఫ్లాప్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.


2021 జనవరి నెలలో  సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ సినిమా భారీ విజయం సాధించడంతో, సినీ ఇండస్ట్రీకి మళ్ళీ మంచిరోజులు వచ్చాయని అందరూ అనుకున్నారు. దాని తరువాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఉప్పెన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో మరింత ఊపునిచ్చింది. అంతేకాకుండా చిన్న సినిమా అయినటువంటి జాతిరత్నాలు సినిమా కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏప్రిల్ నెల వచ్చే సరికి కరోనా మళ్లీ దెబ్బకొట్టింది.


మొదట 3 నెలల్లో ఏ సినీ ఇండస్ట్రీ కోలుకోని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కోలుకుంది. కానీ ఏప్రిల్ చివరికి వచ్చేసరికి చాలా థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఇదే నెలలో విడుదల కావాల్సిన "లవ్ స్టోరీ", "టక్ జగదీష్" వంటి సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక ఈ నెల కూడా  చాలా ఇబ్బందికరంగా మారడంతో ఆచార్య, నారప్ప,అఖండ వంటి బడా సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఏప్రిల్ నెలలో మొదటగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు వైల్డ్ డాగ్,సుల్తాన్ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.


కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. తర్వాత వారం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. దాంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ చివరికి కరోనా ఎఫెక్ట్ పడడంతో ఈ చిత్రం కూడా కోలుకోలేకపోయింది. ఫైనల్ గా అబౌవ్ యావరేజ్ ఫలితం తో సరిపెట్టుకుంది. దీని తర్వాత విడుదలైన సినిమాలు  శుక్ర, ఆర్జీవి దెయ్యం, టెంప్ట్ రాజా, కథానిక, ఒక అమ్మాయి క్రైమ్ స్టోరీ  వంటి చిత్రాల జనాలను  థియేటర్లకు రప్పించలేకపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: