ఏ హీరోకైనా తమ తమ కెరీర్ లో ఒక సినిమా స్పెషల్ గా నిలుస్తుంది. అలా హీరో శర్వానంద్ కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే సినిమా ప్రస్థానం. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి సినిమా పడడం అంటే అదృష్టమనే చెప్పాలి. అప్పటికే శర్వానంద్ హీరోగా ఎదుగుతూ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో దేవకట్టా దర్శకత్వంలో ఆయన చేసిన ప్రస్థానం సినిమా ఆయన కెరీర్ ను వేరే రేంజ్ కు తీసుకు వెళ్ళింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్ గాడ్ ఫాదర్ గా నటించి ప్రేక్షకులు ఎంతగానో అలరించారు. 

ఇక ప్రస్తుత యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.  తన కొడుకు యొక్క భవిష్యత్తు బాగుండాలని ఓ తండ్రి పెంపుడు కొడుకు ను ఏ విధంగా బలిపశువును చేశాడు అనేది ఈ సినిమా కథ. సాయి కుమార్ సొంత కొడుకుగా సందీప్ కిషన్ నటించగా , పెంపుడు కొడుకు గా శర్వానంద్ నటించారు. 2010 ఏప్రిల్ 16 న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్  సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే బాలకృష్ణ సింహ, ప్రభాస్ డార్లింగ్ వంటి సినిమాలు విడుదల కాగా వాటికి గట్టి పోటీ ఇచ్చింది.

ఈ సినిమాకు రెండు నంది అవార్డులు రావడం విశేషం. బెస్ట్ ఫీచర్ ఫిలిం , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సాయి కుమార్ కు నంది అవార్డులు లభించాయి. రెండు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరి లో సాయికుమార్ కి సౌత్ క్రిటిక్స్ అవార్డు కేటగిరీలో దేవా కట్టా కి ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఇక  బాలీవుడ్ లో సంజయ్ దత్ అలీ ఫజల్ హీరోలుగా సేమ్ టైటిల్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం దేవా కట్టా మళ్ళీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: