సినిమాలలోని హీరోలు బాగా క్రేజ్ ఉన్నప్పుడే ఎంతో కొంత వెనక్కి వేసుకోవాలని ఆలోచిస్తుంటారు. ప్రతి ఒక్కరు తను సినిమాలోనూ, బిజినెస్ పరంగా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు కొన్ని యాడ్స్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే, అయితే ఆయా ప్రకటనలకు మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.

1). మహేష్ బాబు:
టాలీవుడ్ హీరోలలో అందగాడు ఎవరంటే మహేష్ బాబు అని చెప్పవచ్చు. ఈయన దాదాపుగా  10 యాడ్స్ లు చేస్తున్నారు. సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఒక్కో యాడ్ కి రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని సమాచారం.

2). వెంకటేష్:
ఈయన  సినిమాలతో ప్రేక్షకులను అలరించే వెంకటేష్, ఈయన కొన్ని యాడ్ లకు నటించగా , అందుకు గాను కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారట.

3). J.R.NTR:
జూనియర్ ఎన్టీఆర్ అంటే సినిమాలో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇక ఈయన నటించే యాడ్స్ కు ఏకంగా కోటి రూపాయల వరకు తీసుకుంటారట.

4). నాగార్జున:
టాలీవుడ్ లో  మన్మధుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది నాగార్జున. ఇక ఈయన ఒక్కొక్క యాడ్ కి కోటిన్నర రూపాయలు తీసుకుంటారని సమాచారం.

5). దగ్గుబాటి రానా:
టాలీవుడ్ లో రానాకి ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు నేనే రాజు నేనే మంత్రి సినిమా తో. అయితే ఈయన ఒక యాడ్ కి కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

6). అల్లు అర్జున్:
తన సినిమాలతో ఎప్పుడూ మాస్ ప్రేక్షకులను అలరించే అల్లు అర్జున్.. ఒక్కో యాడ్ కి కోటిన్నర రూపాయలు తీసుకుంటున్నారు.

7). నాగ చైతన్య:
నాగ చైతన్య , సమంత కలిసి ఎన్నో సినిమాలలో జంటగా నటించి అందరినీ అలరించారు. అంతే కాకుండా వీరు నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక నాగచైతన్య ఒక్కో  యాడ్ కి రూ. 70 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

8). ప్రభాస్ కూడా మొన్న మహేంద్ర కంపెనీ కార్ యాడ్ కి రూ.రెండు కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

కానీ ఇందులో కొంతమంది మన హీరోలు.. వారు సంపాదించే మొత్తంలో  కొంచెం మొత్తాన్ని ఏదైనా సంస్థలకు డొనేషన్  చేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: