బుల్లితెర రియాల్టీ షో "బిగ్ బాస్ తెలుగు-4" ద్వారా విశేషమైన క్రేజ్ సంపాదించుకుంది అలేఖ్య హారిక. షో నుంచి బయటకు వచ్చాక ఆమె యూట్యూబ్ లో పలు కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. అయితే అంతకు ముందు హారిక యూట్యూబ్ స్టార్. "దేత్తడి" పేరుతో యూట్యూబ్ లో కామెడీ వెబ్ సిరీస్ లు చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇంటి పేరు దేత్తడిగా మారిపోయింది. అప్పటి నుంచి దేత్తడి హరికగా పిలవడం మొదలు పెట్టారు. యూట్యూబ్ ద్వారానే ఎంతోమంది యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్న హారిక కొన్ని సినిమాల్లో కూడా ఆర్టిస్ట్ గా నటించింది. యూట్యూబ్ ఛానల్ లో హారికకు ఉన్న క్రేజ్ "బిగ్ బాస్" ఆఫర్ తెచ్చిపెట్టింది. అందులో హారిక పర్ఫామెన్స్ చూసిన తరువాత మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ గా ఆమెకు అవార్డు పెట్టింది. తాజాగా "టాలెంట్ రాక్ అవార్డ్స్ 2021" ప్రకటించిన 'పాపులర్ ఛాయిస్' కేటగిరీలో "డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ ఆఫ్ ది ఇయర్" గా నిహారిక నిలిచింది. ఇది అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ బ్యూటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ నే తన అడ్డాగా మార్చుకుంది. నిజానికి బిగ్ బాస్ తర్వాత అనకు భారీ ఆఫర్లు వస్తాయని భావించిన ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నిహారిక ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. పైగా ఎప్పటిలాగే యూట్యూబ్ లోనే డాన్స్ వీడియోస్ తో కాలక్షేపం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమెకు ఈ అవార్డు రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. అందం, అభినయం మాత్రమే కాకుండా డాన్స్ కూడా ఇరగదీసే ఈ చిన్నదానికి మరి ఆఫర్లు ఎందుకు రావట్లేదో తెలియట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: