అక్కినేనిది సుదీర్ఘమైన సినీ కెరీర్. ఆయన చివరి దాకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే అక్కినేని లాంటి మహా నటుడికి కూడా ఒక దశలో వరస ఫ్లాప్స్ వచ్చాయి. ఆయన కెరీర్ లో సేకండ్ ఇన్నింగ్స్ కి ముందు చాలానే సినిమాలు బోల్తా కొట్టాయని చెబుతారు.


ఈ నేపధ్యంలో 80 నాటికి అక్కినేని మార్కెట్ కూడా బాగా డల్ అయింది. ఆయనకు పెద్ద హిట్ అంటూ కూడా ఏదీ లేకుండా పోయింది. దీంతో ఆయనతో వరస సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు కూడా మూవీస్ చేయలేదు. ఈ నేపధ్యంలో కొత్త నిర్మాతలు  సాహసించి ఆయనతో సినిమా తీయాలనుకున్నారుట. అలా మొదలైంది ఏడంతస్తుల మేడ చిత్రం.


ఈ సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్టర్. ఈ సినిమాలో మూడు వంతులు షూటింగ్ కాశ్మీర్ లో చిత్రీకరించారు. శరవేగంగా పూర్తి అయిన ఈ సినిమా రషెస్ చూసిన వారు కూడా ఫరవాలేదు అన్నారు కానీ హిట్ అని  గట్టిగా చెప్పలేదుట. మొత్తానికి ఈ సినిమాకు 1980 జనవరి 1న విడుదల చేశారు.  మొదటి ఆట నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు ఈ సినిమా తరువాత మళ్ళీ అక్కినేని యుగం మొదలైపోయింది. అది ఎంతవరకూ వెళ్ళిందంటే ఆ తరువాత ఏడాది ప్రేమాభిషేకం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అక్కినేని సెకండ్ ఇన్నింగ్స్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తానికి మహా మహా నటులకే కొంత ఇబ్బంది తప్పదు అనడానికి అక్కినేని కెరీర్ కొంత డౌన్ అవడం ఒకటైతే ఏడంతస్తుల మేడతో అది ఏకంగా పెర్మనెంట్ గా అక్కడే ఉండడం మరో విశేషం. ఆ తరువాత రోజులలో దీనికి సీక్వెల్ కూడా చేయాలని దాసరి అనుకున్నా ఎందుకో వీలుపడలేదు అంటారు. మొత్తానికి ఈ మూవీ మాత్రం అక్కినేని వారి సినీ చరిత్రలో మేలి మలుపు అనే చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

anr