మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి.  అలాంటి సినిమాల్లో 'మురారి' సినిమా ఒకటి. మహేష్ బాబుకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను తెచ్చిపెట్టిన 'మురారి' సినిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..
అది 1998 మహేష్ బాబు ను హీరోగా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ , దర్శకుడు కృష్ణవంశీ దగ్గరికి వెళ్లి మహేష్ బాబు మొదటి సినిమాకు దర్శకత్వం చేయండి అని అడిగారు, దానితో కృష్ణవంశీ మొదటి సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా కష్టం సార్ నేను రెండో సినిమా చేస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మహేష్ బాబు కమిట్మెంట్స్ వల్ల తన నాలుగో సినిమా కృష్ణ వంశీ దర్శకత్వంలో చేయవలసి వచ్చింది. అప్పటికే మహేష్ బాబు సూపర్ స్టార్, అతనితో ఒక రొమాంటిక్ సినిమా తీయాలనే ఉద్దేశంతో కృష్ణవంశీ చిలిపి కృష్ణుడి తరహాలో ఉన్న కథకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించే చేసే పనిలో ఉన్నాడు.
పది రోజుల్లో కృష్ణ గారికి కథ చెప్పాలి. ఈ లోపు గోదావరి తీరంలో సేదతీరాలని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాడు, మాటల మధ్యలో ఫిరోజ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్లంతా అర్ధాంతరంగా ఎందుకు చని పోతున్నారు అనే టాపిక్ వచ్చింది. శాపం వల్ల అని అన్నాడు ఒక ఫ్రెండ్. ఏంటి శాపాలు పని చేస్తాయా, అని కృష్ణవంశీ అన్నాడు. దానితో తన పక్క ఊరిలోనే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది  అని, ఒక పెద్ద మనిషి తన పాలేరును చంపితే ఆ పాలేరు భార్య ఏడుస్తూ శాపం పెట్టిందని, ఆ తర్వాత ఆయన ముగ్గురు కొడుకులు రకరకాల యాక్సిడెంట్ లలో చనిపోయారు అని చెప్పాడు అదే ఫ్రెండ్. కృష్ణం వంశీ కి ఇదంతా థ్రిల్లింగ్ గా ఉంది,  ఈ పాయింట్ ను మహేష్ బాబు స్టోరీలో లింక్ చేస్తే ఎలా ఉంటుంది, అనే ఉద్దేశంతో ఆ పాయింట్ ను మహేష్ బాబు కథ లో జాయిన్ చేశాడు. కృష్ణ గారికి వినిపించాడు ఏమీ అర్థం కాలేదు, మహేష్ బాబు కు కూడా వినిపించాడు వేరే ఏదైనా కథ ఉందా అని అడిగాడు, వేరే కథ వినిపించినప్పుడు ఇది బాగుంది అని అని మహేష్ బాబు చెప్పాడు, ఈ కథ అయితే సినిమా హిట్ అవుతుంది, అదే ముందు చెప్పిన కథ చేస్తే క్లాసిక్ అవుతుంది అని కృష్ణవంశీ చెప్పాడు. దానితో మహేష్ బాబు ఒకే చెప్పాడు. సినిమా సెట్స్ పైకి వెళ్ళింది అంతా సజావుగా పూర్తి చేసుకొని 2001లో విడుదల అయ్యింది. విడుదల అయిన తర్వాత ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా విమర్శకుల ప్రశంసలు కూడా 'మురారి' సినిమా పొందిం,  ఒక మంచి ఫ్యామిలీ సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: