ఒక్కో హీరోకి ఒక్కో ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్‌నే సేఫ్‌ జోన్‌గా చూస్తుంటారు. ఫ్లాప్‌లొచ్చినప్పుడల్లా ఆ జోన్‌కే వెళ్తుంటారు. అయితే నితిన్ మాత్రం మళ్లీ ఫామ్‌లోకి రావడానికి సేఫ్ జోన్‌ నుంచి బయటకొస్తున్నాడు. లవ్ స్టోరీస్‌ కంటే డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌కే ప్రియారిటీ ఇస్తున్నాడు.

నితిన్‌ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్ధాలు అవుతోంది. అయితే ఇన్నేళ్ల ప్రయాణంలో ఈ హీరోకి
సూపర్ హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ వచ్చాయి. అయితే గ్రాఫ్ డౌన్ అవుతున్నప్పుడల్లా నితిన్‌ లవ్ స్టోరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రేమకథలని సేఫ్‌ జోన్‌గా మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం స్లంపు నుంచి బయటపడ్డానికి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నాడు నితిన్.

నితిన్‌కి 'అఆ' తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'లై, చల్ మోహన్‌ రంగ, శ్రీనివాస కళ్యాణం'తో స్లంపులో పడిపోయాడు. అయితే ఆ తర్వాత 'భీష్మ'తో ఓకే అనిపించుకున్నా 'చెక్, రంగ్‌ దే'తో తడబడ్డాడు. ఇక ఈ స్టేజ్‌ నుంచి బయటపడ్డానికి హిందీ మూవీ 'అంధాదున్'ని 'మ్యాస్ట్రో'గా రీమేక్‌ చేశాడు. ఈ మూవీలో అంధుడిగా నటించాడు నితిన్.

నితిన్‌ నెక్ట్స్‌ వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు. 'నా పేరు సూర్య' ఫ్లాప్‌తో చాలా గ్యాప్ తీసుకున్న వక్కంతం మళ్లీ ఈ సినిమాతోనే మెగా ఫోన్ పడుతున్నాడు. అలాగే స్టైలిష్ ఎంటర్‌టైనర్స్‌ తీసే సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ఒక సినిమా చేయ్యబోతున్నాడు నితిన్. మరి ఈ మూవీస్‌తో నితిన్‌ ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటాడో చూడాలి.

మొత్తానికి నితిన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తమకు ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడోనని వెయిట్ చేస్తున్నారు. నితిన్ ఎప్పుడూ లవ్ స్టోరీస్ లోనే ఎక్కువగా చూశాం. ఆయన లవర్ బాయ్ గా కుర్రకారును ఎలా మెస్మరైజ్ చేశాడో అందరికీ తెలుసు. అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా గిలిగింతలు కూడా పెట్టాడు. ఇప్పుడు డిఫర్ జానర్ లను ఎంచుకుంటున్న నితిన్ ను.. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: