ఎన్నో అంచనాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ ఊహించని ఫలితాలు రాబట్టలేకపోయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలపై దర్శకుడు వివరణ ఇచ్చాడు. అందుకు పెద్ద కారణమే ఉందంటున్నాడు. అజ్ఞాతవాసి తీసుకొచ్చిన ఓటమిని అందరి ముందు ఒప్పుకున్నాడు. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వాస్తును బాగా నమ్ముతాడు. దైవ భక్తి కూడా ఎక్కువే. పూజ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. అలాంటి దర్శకుడు ఎన్నో అంచనాలతో తీసిన సినిమా ఫ్లాప్ అయ్యే సరికి ఓటమికి గల కారణాలపై ఆలోచించి తన బాధను వ్యక్తపరిచాడు. వాస్తు సరిగా లేకపోవడం వల్లే అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిందని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.

 త్రివిక్రమ్ శ్రీనివాస్... అజ్ఞాతవాసి తెరకెక్కించే సమయంలో ఉంటున్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయట. వాస్తు ప్రకారం కాకుండా ఇళ్లు ఉండటం వల్ల ఆ ప్రభావం అజ్ఞాతవాసి సినిమాపై పడిదందని త్రివిక్రమ్ చెప్పారట.
ఆ తర్వాత ఆ ఇంటిని ఎలాంటి దోషం లేకుండా ఉండేలా.. పునర్నిర్మించాడు త్రివిక్రమ్. జ్యోతిష్యాన్ని, న్యూమరాలజీని నమ్మేవారు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇంకేముంది త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో చెలరేగిపోతున్నాడు. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తోటి డైరక్టర్లు.. నటులు.. నిర్మాతలు.. వాస్తు గురించి సంప్రదిస్తున్నారట. దీంతో ఈ దర్శకుడు నలుగురికీ వాస్తు సలహాలు ఇస్తూ.. సక్సెస్ లో దూసుకుపోతున్నాడు. మొత్తానికి అజ్ఞాత వాసి ఫ్లాప్.. ఆయన జీవితాన్ని కొత్త మలుపులు తిప్పేలా చేస్తోంది.


త్రివిక్రమ్ తాను చేయబోయే కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.ఎలాంటి లోటు పాట్లు లేకుండా జాగ్రత్తపడుతున్నాడు. అందుకే వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. త్రివిక్రమ్ కోసం చాలా మంది హీరోలు క్యూలో ఉన్నారు. తమకు ఆ దర్శకుడి నుంచి పిలుపు ఏమైనా వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.  










మరింత సమాచారం తెలుసుకోండి: