క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం గోవిందుడు అందరివాడేలే.. ఇందులో కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్ , జయసుధ , శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రాన్ని పరమేశ్వర ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. 2014 అక్టోబర్ ఒకటో తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.. ఆ తర్వాత ప్రేక్షకులు పట్టించుకోవడమే మానేశారు.. ఇందుకు గల కారణం ఏమిటంటే .. అత్తారింటికి దారేది సినిమా లైన్ ను తీసుకొని మురారి ,చందమామ స్టైల్లో తెరకెక్కించినట్లు ఉంది అంటూ విమర్శలు గుప్పించారు..

నిజం చెప్పాలంటే అతి కష్టం మీద ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు కృష్ణవంశీ.. చిత్రీకరణ సమయంలో కూడా ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చిందట.. రామ్ చరణ్ హీరోగా, బండ్ల గణేష్ నిర్మాణంలో అనగానే ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివను అనుకున్నారు..కానీ ఆయన తప్పుకోవడంతో కృష్ణవంశీ డైరెక్ట్ చేయడం జరిగింది.. శ్రీకాంత్ పాత్రలో కూడా స్టార్ హీరో వెంకటేష్ అని అనుకున్నారు.. కానీ ఆయన తన ఇమేజ్ కు తగ్గట్టు లేదని భావించి,ఆయన కూడా తప్పుకోవడం జరిగింది.. తర్వాత తమిళ నటుడు రాజ్ కిరణ్ ని కూడా అనుకున్నారు.. సగం షూటింగ్ పూర్తి చేసిన తర్వాత అతడు కూడా ఏదో కారణాల చేత తప్పుకోవడం జరిగింది. చివరికి హీరో శ్రీకాంత్ చేయవలసి వచ్చింది.


మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ముందుగా ఎస్.ఎస్.థమన్ ని అనుకోగా అతను కూడా తప్పుకోవడంతో,  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు.. షూటింగ్ సమయంలోనే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని, ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ ఒకటో తేదీన విడుదల అయింది.. అంటే ఈ రోజుకి దాదాపుగా ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదట కొద్ది రోజులు ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినా.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: