తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని మరో మెట్టెక్కించిన చిత్రం మగధీర. ప్రేమకు మరణం లేదు అని ప్రేమ అమరం అని.. ఎన్ని యుగాలు గడిచినా ప్రేమ తన నమ్మకాన్ని నిలబెట్టి విజయం సాధిస్తుందనే సరికొత్త కథనంతో సినిమా తీసి భారీ విజయాన్ని అందుకుని మరోసారి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు రాజమౌళి. అలనాటి మన రాజుల చరిత్రను వారి వైభవాన్ని..కట్టుబాట్లను మన ముందు ఉంచారు ప్రతిష్టాత్మక దర్శకుడు జక్కన్న. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో పాత్రల విషయానికొస్తే రామ్ చరణ్ తేజ్ కి ఈ సినిమా అతడి కెరియర్ ను మలుపు తిప్పే మూవీగా మారింది అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో చెర్రీ రెండు పాత్రల్ని చేసిన విషయం తెలిసిందే.

ఒక జన్మలోనే ప్రేమ జ్ఞాపకాలు కొన్ని యుగాల తర్వాత మరో జన్మలో గుర్తుకు రావడం ఆ ప్రేమను దక్కించుకోవడానికి అతడి ప్రయత్నం...ఇవన్నీ వినడానికి కాస్త ఫన్నీ గా, అసాధారణంగా అనిపించినా వాటిని అద్భుతంగా వెండి తెరపై చూపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాజమౌళి. రామ్ చరణ్ తన రెండు పాత్రలను అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా కాలభైరవుడిగా తన గత జన్మ పాత్రలో ఒదిగిపోయి తన నటనా చాతుర్యాన్ని  చూపించారు చెర్రీ. గుఱ్ఱపు స్వారీలతో అలాగే కత్తి యుధ్ధాలతో అలనాటి రాజుల కాలాన్ని కళ్లముందుకు తీసుకొచ్చాడు. ఇక శ్రీహరి నటన ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యింది. షేర్ ఖాన్ పాత్రలో తన రాజసాన్ని ప్రదర్శించాడు. ఒరేయ్ బుల్లోడా అనే శ్రీహరి డైలాగ్ బాగా ఫేమస్ అయింది.

కాలభైరవుడికి (రామ్ చరణ్ తేజ్) షేర్ ఖాన్ ( శ్రీహరి) మధ్య జరిగే యుద్ద సన్నివేశం సినిమా కే హైలెట్ అని చెప్పాలి. ఒక్కొక్కర్ని కాదు షేర్ ఖాన్ ఒకేసారి వంద మందిని రమ్మను.. అనే రామ్ చరణ్ డైలాగ్..అలాగే భగభగ మండే సూరిడులా నువ్వు మళ్ళీ పుడుతావురా భైరవా అనే శ్రీహరి డైలాగ్ ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్నాయి. పెద్దవారి నుండి చిన్న పిల్లలు కూడా ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ ను ఎంతో ఇష్టంగా వాడుతున్నారు అంటే ఈ డైలాగ్ జనాల మనసుల్లోకి ఎలా వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలభైరవ వీరత్వానికి, ప్రేమకు ముగ్ధుడైన రాజు షేర్ ఖాన్ కూడా మరో జన్మ ఎత్తి వారి ప్రేమకు సహాయం చేసే పాత్రల్లో ఒదిగిపోయారు శ్రీహరి. ఈ మూవీలో శ్రీహరి పాత్ర చిన్నదే కానీ మూవీకి మాత్రం చాలా కీలకంగా మారింది. ఇందులో షేర్ ఖాన్ గా ఆయన గెటప్, డైలాగ్స్ అందర్నీ ఆకర్షించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: