షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు అక్టోబర్ 7 వరకు క‌స్ట‌డీని పొడిగించింది ఎన్‌సీబీ. కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్‌లో మాదకద్రవ్యాల కేసులో అక్టోబర్ 3 న ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీని తరువాత, పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్ మరియు అతని భార్య గౌరీ ఖాన్ ఆర్య‌న్‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు. సల్మాన్ ఖాన్, అల్విరా ఖాన్, సీమా ఖాన్, మహీప్ కపూర్ మరియు ఇతరులు ముంబైలోని షారూఖ్ ఖాన్ ఇంటికి వెళ్లి క‌ల‌వ‌గా ఇత‌రులు సోషల్ మీడియాలో అతనికి మద్దతు ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా అనుపమ్ ఖేర్ మరియు కిర్రాన్ ఖేర్ కుమారుడు సికందర్ ఖేర్ ఈ కేసుపై స్పందించారు.



 షారుఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్ అరెస్టు మరియు ఎన్‌సీబీ కస్టడీపై జాతీయ మీడియాతో సికందర్ మాట్లాడారు.  ఆర్య‌న్ ఖాన్ కేసు గురించి అడ‌గ‌గా.. `నేను ప్రత్యేకంగా ఎవరినీ పేర్కొనడానికి ఇష్టపడను. నేను ఏదైనా చెప్పగలను కానీ, చట్టం త‌న ప‌ని త‌న‌ని చేసుకోనివ్వండి. అతడు దోషి, ఆమె దోషి, మీరు హంతకుడు ` అని నేను ఎలా చెప్పగలను అని ప్ర‌శ్నించారు. దేనిపైన అయిన మాట్లాడే ముందు నోరును అదుపులో పెట్టుకోవాల‌న్నారు.  నోరు అతని గురించి లేదా ఇంకెవరి గురించి మాట్లాడుతుందో ? అని, ఒక వ్యక్తిగా వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను,  మీరు ఎవరి గురించైనా  నోరు పారేసుకోవ‌ద్దు` చెప్పారు.


       అయితే, ఇది ఏకపక్ష సమస్య కాద‌ని,  అలాంటి విషయాలు చదవాలనుకునే లేదా చూడాలనుకునే వారు ఉన్నందున ఇది జరుగుతుంద‌ని చెప్పారు. మనుషులు సులువుగా ప్ర‌తికూల‌త వైపు మ‌ళ్లుతారు అని భావించారు. అలాంటి క్షణాల్లో సానుకూలంగా ఉండడమే కఠినమైన ప‌రిస్థ‌తి అని చెప్పుకొచ్చారు. ఒకరిపై తీర్పు ఇవ్వడం లేదా వారి పాత్రపై వేలు చూపడం చాలా సులభం అని చెప్పారు. కోవిడ్ -19 మరియు గత రెండేళ్లు మాకు నేర్పిన పాఠం వ‌ల్ల దయగా ఉండాలని నేర్చుకున్నాన‌న్నాడు. ఒకరికొకరు  కృతజ్ఞతతో ఉండండి అంటూ సూచించారు. ప్రజలు దయపై ఎక్కువ దృష్టి పెట్టాలని మరియు అది మానవత్వానికి పెద్ద సందేశం కావాలని ఆశిస్తున్నాన‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: