ఆసిన్ భర్త విషయానికి వస్తే, ఆసిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.. విచిత్రమేమిటంటే యాదృచ్ఛకంగా కొంచెం గజినీ సినిమా కు దగ్గరలో ఉంటుంది ఈమె ప్రేమ కథ.. ఆసిన్ రాహుల్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో గా గుర్తింపు పొందిన అక్షయ్ కుమార్ ప్రాణస్నేహితుడు. అక్షయ్ కుమార్ కారణంగానే వీళ్ళిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. ఇకపోతే రాహుల్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. మైక్రోమాక్స్ సంస్థకు సీఈవోగా కూడా పని చేస్తున్నాడు.
ఇక వీరికున్న కార్ల విషయానికి వస్తే ..కొన్ని కోట్ల రూపాయల విలువ గల కార్లు ఉండడం విశేషం.. అందులో ఆడి క్యూ ఫైవ్, ఆడి ఏ6, రోల్స్ రాయిస్, బెంట్లీ తదితర మోడల్స్ కార్లు వీరి దగ్గర ఉన్నాయి. వీరి ఇంటి విషయానికొస్తే ఎన్ సీ ఆర్ నగర్ ఢిల్లీ లో అత్యంత విలాసవంతమైన భవనం వీరి సొంతం. అంతేకాదు ముంబైలో కూడా వీళ్ళకు ఫ్లాట్స్ ఉన్నాయి. కేరళలోని కొచ్చిన్ లో కూడా పలు భూములు, ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక రాహుల్ శర్మ , ఆసీన్ మొదట 2016 అక్టోబర్ 24వ తేదీన ఒక బిడ్డకు జన్మనిచ్చారు.