ఇద్దరు టాలీవుడ్ టాప్ డాన్సర్స్ ఒకే పాటలకు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఈ ఆలోచన రాజమౌళి  నిజం చేసి చూపిస్తున్నారని తెలుస్తుంది.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఓ ఊరమాస్ సాంగ్ కి వీర మాస్ స్టెప్స్ వేసి అలరించనున్నారని  ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుందని తెలుస్తుంది.నాటు నాటు లిరికల్ వీడియో రేపు విడుదల కానుందని సమాచారం.. ఈ నేపథ్యంలో నేడు ఈ సాంగ్ ప్రోమో విడుదల చేసిందట చిత్ర బృందం. 'నా పాట సూడు... నా పాట సూడు...నాటు నాటు నాటు.... వీర నాటు నాటు నాటు ... ఊర నాటు నాటు నాటు' అంటూ సాగిన 20 సెకెన్ల ప్రోమో బాగుందని తెలుస్తుంది.


ఫాస్ట్ బీట్ లో పరుగులు పెడుతున్న ప్రోమో పూర్తి స్థాయి సాంగ్ పై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు. ఇక వెండితెరపై ఈ పాటలకు ఎన్టీఆర్ (Ntr) , రామ్ చరణ్ కలిసి డాన్స్ చేస్తుంటే చూడాలన్న ఆత్రం కలుగుతుందని కీరవాణి స్వరాలు సమకూర్చగా సీనియర్ లిరిసిస్ట్ అయిన చంద్రబోస్ సాహిత్యం అందించారని తెలుస్తుంది . రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ కలిసి పాడడం జరిగిందని మొత్తంగా నాటు నాటు.. సాంగ్ అంచనాలకు తగ్గకుండా ఉందని సమాచారం.


బ్రిటీష్ కోటలో రామ్-భీమ్ ఆటా పాటా మరియు మారువేశాల్లో బురిడీ మైండ్ బ్లాకింగ్ డిటైల్స్ అని
ఇక నాటు నాటు సాంగ్ నేపథ్యంలో ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది.. బ్రిటీష్ కాన్సర్ట్ లో భీమ్ మరియు రామ్ ప్రదర్శన ఇచ్చే సందర్భంలో ఈ పాట రానుందని తెలుస్తుంది. బ్రిటీష్ వారంటే కత్తి దూసే రామ రాజు, భీమ్  వాళ్ళ పార్టీలో డాన్స్ వేయడం ఏమిటీ అనే సందేహం మనకు కలగవచ్చని  దీనికి సమాధానం... బ్రిటీష్ వాళ్ళను దెబ్బ తీసే క్రమంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అనేక మారువేషాలు ధరిస్తారని వాళ్ళను మోసం చేయడానికి అనేక ఎత్తులు మరియు వ్యూహాలు రచిస్తారని తెలుస్తుంది.. దానిలో భాగంగా బ్రిటీష్ ఎంపైర్ పై దాడి చేయడానికి వెళ్లిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ప్లాన్ లో భాగంగా ఇలా డాన్స్ చేసి ఉండవచ్చని తెలుస్తుంది. `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. `ఆర్ఆర్ఆర్‌` సెకండ్‌ సింగిల్‌
అనేక ప్రత్యేకతల సమాహారంగా ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి తీర్చిద్దతున్నారట. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ సినిమాను బాగా ప్రేక్షకులలోకి తీసుకెళుతున్నాయని పివిఆర్ సినిమాస్ తో టై అప్ అయిన ఆర్ ఆర్ ఆర్ టీం  మూవీ ప్రోమోలు ఆ థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారట ఇప్పటికే వెండితెరపై ఆర్ ఆర్ ఆర్ గ్లిమ్ప్స్ సందడి చేస్తుందని తెలుస్తుంది.

నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మిస్తున్నారని  బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారని సమాచారం. హీరో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. 2022 జనవరి 7న సంక్రాంతి కానుకగా, ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ గా విడుదల కానుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR