టాలీవుడ్ లో ఎందరో గాయని గాయకులు వస్తుంటారు, వెళుతుంటారు కానీ కొందరి గాయకులు మాత్రం మత్తెక్కించే గాత్రంతో మైమరపించి.. మన హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. అలాంటి వారిలో గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్ పి బాల సుబ్రమణ్యం మొదట స్థానాన్ని ఆక్రమించగా...ఆ తర్వాత సుశీలమ్మ, సింగర్ మనో, గాయని చిత్ర, సునీత వంటి సీనియర్ గాయకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సంగీత రాజ్యాన్ని ఏలుతున్న కొందరు యువ గాయకులు ఎవరో ఒకసారి చూద్దాం.

వారిలో చిన్మయి శ్రీపాద,హేమచంద్ర, సిద్ శ్రీరామ్, దీపు, రేవంత్, గీత మాధురి, శ్రావణ భార్గవి,శ్రీ రామ చంద్ర, మాళవిక,రమ్య బెహ్రా, శ్రీ కృష్ణ, అంజన సౌమ్య వంటి వారు ప్రస్తుతం టాలీవుడ్ లో  బెస్ట్ సింగర్స్ గా రాణిస్తున్నారు. అయితే వీరిలో కొందరు వివరాలను ఇపుడు తెలుసుకుందాం.

సిద్ శ్రీ రామ్

యువ గాయకుడు తమిళనాడులో జన్మించారు. అయితే చిన్నప్పుడే వీల్ల ఫ్యామిలీ కాలిఫోర్నియా కు వెళ్ళిపోయారు.  ఇతని తల్లి లత ఒక సంగీత ఉపాధ్యాయురాలు కావడంతో...సంగీతంపై మక్కువ ఏర్పడి అలా సంగీతాన్ని తన కెరియర్ గా ఎంచుకున్నారు. "హుషారు" చిత్రంలో "ఉండి పోరాదే గుండె నీదేలే", నిన్నుకోరి "అడిగా అడిగా", గీత గోవిందం "ఇంకేం ఇంకేం కావాలి" వంటి సూపర్ హిట్స్ సాంగ్స్ ను పాడారు. ఇప్పుడు ఈ పాటలతో వచ్చిన క్రేజ్ తో ఎన్నో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

శ్రీ రామ చంద్ర

మైనం పాటు శ్రీ రామ చంద్ర ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు. వీరి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. 2005 నుండే పాటలు పాడడం మొదలుపెట్టారు. కానీ ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు లభించింది.  బాలీవుడ్ లో కూడా చాలా పాటలు పాడారు. తెలుగులో  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి "ఆకాశం విరిగినట్టుగా", సోలో మూవీలో "అమ్మమ్మమ్మో ఈ అమ్మాయికే నచ్చరా ",  తీన్మార్ మూవీ నుండి "గెలుపు తలుపులే తీసే" వంటి పలు సాంగ్స్ పాడగా అవి విశేష ప్రేక్షకాదరణ పొందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: