నందమూరి నట సింహం బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు. బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్ లు , బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు. అలాంటి ఈ హీరో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ లను అందుకున్నాడు. అలా ఫ్యాక్షన్ సినిమాలు తో అదిరిపోయే రికార్డులు సాధించిన బాలకృష్ణ చాలా వరకు అదే తరహా సినిమాల్లో నటిస్తూ రావడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విఫలమవుతూ వచ్చాయి.  వేరే జోనర్ లో సినిమాలు ప్రయత్నించినా కూడా ఫలితాలు మాత్రం బాలకృష్ణ ఆశించిన రేంజ్ లో దక్కలేదు.

అలా చాలా సంవత్సరాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్న బాలకృష్ణకు, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సింహ సినిమా పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార, స్నేహ ఉల్లాల్ లు హీరోయిన్ లుగా నటించగా, నమిత ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. అదిరిపోయే యాక్షన్ సీన్ లతో, అంతకుమించిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు చక్రి అందించిన సంగీతం మరింత ప్లస్ అయ్యింది. బోయపాటి శ్రీను 'సింహ' సినిమా కు ముందు భద్ర, తులసి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే సింహా సినిమా మాత్రం ఈ రెండు సినిమాల కంటే పెద్ద విజయం సాధించి బోయపాటి శ్రీను కు టాలీవుడ్ లో అదిరిపోయే మాస్ దర్శకుడిగా పేరు తీసుకు వచ్చింది. 30 ఏప్రిల్ 2010 న విడుదలైన సింహ  సినిమాతో బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో రికార్డులను కూడా సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: