రంగుల ప్రపంచం సినీ జీవితంలో ఎవరు ఎపుడు స్టార్ లు అవుతారో, ఎపుడు స్టార్ హోదా ఉన్నప్పటికీ కాలం కలిసి రాక ఇండస్ట్రీ నుండి వెనుదిరిగిన తారలు ఉన్నారు. ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అన్న సామెత ఇక్కడ సరిగ్గా నప్పుతుంది. అయితే టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇపుడు పూర్తిగా సినీ పరిశ్రమ కు దూరమైన కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం. 

తరుణ్:  లవర్ బాయ్ గా ఇండస్ట్రీని ఒక ఉపిన ఊపిన హీరో తరుణ్, తన తల్లి నటి కావడంతో అదే స్పూర్తితో బాలనటుడుగా సినిమాలలోకి అడుగుపెట్టిన తరుణ్ 'నువ్వేకావాలి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని కీర్తి ప్రతిష్టలు పొందాడు. ఆ తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు ఈ యంగ్ హీరో. ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను, వంటి చిత్రాలు మంచి హిట్ లను అందించి తరుణ ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతూ నిరాశ పర్చడంతో తరుణ్ ఫేడవుట్ అయిపోయారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఆర్యన్ రాజేష్ : టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులలో ఒకరైన ఈవివి సత్యనారాయణ అగ్ర తనయుడు ఆర్యన్ రాజేష్ కూడా కొన్ని చిత్రాలకే ఇండస్ట్రీకి దూరమయ్యారు. స్టార్ దర్శకుడి తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆర్యన్ రాజేష్. 'హాయ్' చిత్రంతో తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో 'సొంతం' సినిమాతో యూత్ ఆడియన్స్ ని అయస్కాంతంలా తనవైపు ఆకర్షించాడు. 'ఎవడిగోల వాడిది' సినిమా కూడా మంచి పేరును తెచ్చింది. కానీ ఆ తర్వాత చేసినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడం తో హీరోగా వెనక్కి తగ్గారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'వినయ విదేయ రామ' సినిమాలో చెర్రీకి అన్నయ్యగా నటించి అలరించారు.

ఇదే తరహాలో  హ్యాపీ డేస్ సినిమాతో యూత్ ను అలరించిన  రాహుల్, తొట్టెం పుడి వేణు, నందమూరి తారక రత్న, రాజ, స్నేహ ఉల్లాల్, శ్వేతా బసు ప్రసాద్  వంటి నటులకు మంచి అవకాశాలు లభించక తెరమరుగై పోయారు. అందుకే అవకాశాలు ఎప్పుడూ రావు. ఉన్న ఆ కాస్త సమయంలోనే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: