మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో దాదాపు ద చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లే. అయితే ఆ సినిమాలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు.అయితే సోషియో ఫాంటసీ సినిమాగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు రాఘవేంద్రరావు గారి తో పాటుగా జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించగా ఈ సినిమాతో ఆయనకు భారీ లాభాలు వచ్చాయి. మెగాస్టార్ నటించిన ఈ సినిమాలో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

 ఈ సినిమా రిలీజ్ అయిన దాదాపుగా 31 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఇప్పటికీ ఈ సినిమాకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. అప్పట్లో ఈ సినిమా ఒక రేంజ్ లో ఆడింది. అయితే అప్పట్లో హీరోగా నటించిన చిరంజీవి ఈ సినిమాకు 35 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారట. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రీదేవి కూడా చిరంజీవికి ఏమాత్రం తగ్గకుండా పాతిక లక్షల పారితోషికం తీసుకోవడం జరిగింది. అయితే శ్రీదేవి అప్పట్లో బాలీవుడ్లో మంచిగా రాణించడంతో చిరంజీవి స్థాయిలోనే పారితోషికాన్ని తీసుకుంది. అయితే ఈ సినిమా తీయడం వల్ల నిర్మాతలకు 35 లక్షల లాభం వచ్చింది.

 అయితే ఇప్పట్లో 35 లక్షల పారితోషికం తీసుకోవడం అంటే చాలా తక్కువ కానీ మూడు దశాబ్దాల క్రిందట 35 లక్షలు అంటే వారికి చాలా ఎక్కువ. అంటే మొత్తానికి అప్పట్లో ఈ సినిమా ఏడు కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. అయితే అప్పట్లో బాల్కనీ సీట్ రేటు కూడా కేవలం ఆరు రూపాయలే . ఒకానొక సందర్భంలో చిరంజీవి నేను చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎప్పటికైనా ఎవర్ క్లాసిక్ అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ని పూర్తి చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు చిరు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: