అల్లు అర్జున్ రగ్గడ్ లుక్ లో నటించిన సినిమా పుష్ప. ఇప్పటికే హిట్ టాక్ సొంతం చేసుకొని బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఆయన కొత్త లుక్ ని అభిమానులు కొత్తగా ఫీల్ అవుతున్నారు. 'పుష్ప'లో అల్లు అర్జున్‌ లుక్‌కి ఎంత రెస్పాన్స్‌ వచ్చిందో, ఆల్బమ్‌కి అంతకుమించిన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఐటెమ్‌సాంగ్‌కి అయితే చాలా తక్కువగా సమయంలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్‌ పాడిన ఈ పాటకి కుర్రాళ్లు కేరింతలు కొడుతున్నారు. సమంత ఈ స్పెషల్‌ సాంగ్‌ కు చేసిన పెర్ఫామెన్స్ ఆడియన్స్ లో జోష్ నింపింది.  

మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన సినిమా 'రంగస్థలం'. సినిమా మాత్రమే కాదు ఆల్బమ్‌ కూడా అంతే యూనిక్‌గా నిలిచింది. ఫోక్‌ స్టైల్‌కి దగ్గరగా వచ్చిన ఈ ఆల్బమ్‌లో కూడా దేవిశ్రీ ప్రసాద్‌ అదిరిపోయే ఐటెమ్‌ సాంగ్‌ ఇచ్చాడు. జిగేలు రాణి సాంగ్‌తో ఆడియన్స్‌ని డ్యాన్సులు చేయించాడు. మహేశ్‌ బాబు కెరీర్‌లో వెరీ స్టైలిష్‌ ఫిల్మ్‌గా తెరకెక్కింది 'వన్‌ నేనొక్కడినే'. సుకుమార్‌ ఈ మూవీలో మహేశ్‌ని కంప్లీట్‌ స్టైలిష్‌ స్టార్‌గా చూపించాడు. రాక్‌స్టార్‌ గౌతమ్‌గా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇక మ్యూజికల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న ఈ మూవీలో కూడా బోల్డ్ ఐటెమ్‌ సాంగ్‌ పెట్టారు. 'లండన్‌ బాబు' పాటతో థియేటర్లని మరో ఊహల్లోకి తీసుకెళ్లారు.

తెలుగు ఆడియన్స్‌కి ఇన్‌ఫాక్చుయేషన్ అనే పదాన్ని వాడుక భాషగా మార్చేసిన సినిమా '100% లవ్'.  సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కూడా దేవిశ్రీ ప్రసాద్‌ క్రేజీ ఐటెమ్‌ సాంగ్‌ ఇచ్చాడు. డియ్యాలో డియ్యాలో అనే పాట అయితే దుమ్మురేపింది. చాక్లెట్‌ బాయ్‌ రామ్‌ని యాక్షన్‌ స్టార్‌గా చూపించిన సినిమా 'జగడం'. సుకుమార్‌ దర్శకత్వంలో శివ స్టైల్‌లో వచ్చిన ఈ యాక్షన్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఈ మూవీలో దేవిశ్రీ ఇచ్చిన '36-24-36' అనే ఐటెమ్‌ సాంగ్ అయితే మాస్‌ లో జోష్ నింపింది. మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ ఐటెమ్‌ సాంగ్స్‌ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: