సల్మాన్ ఖాన్ ఉదార స్వభావం అతనికి బాలీవుడ్ భాయిజాన్ అనే బిరుదును తెచ్చిపెట్టింది. సల్లూ భాయ్ తన చిత్రాలలో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రసిద్ది చెందాడు. చాలా మంది నటీమణులు బాలీవుడ్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడంలో సహాయపడాడు. సల్మాన్ మెంటర్‌ గా పని చేసిన నటీనటుల జాబితా మొత్తం మీ కోసం. సోనాక్షి సిన్హాకు కలల అరంగేట్రం నుండి 'దబాంగ్ 3'లో సాయి మంజ్రేకర్‌ని ప్రారంభించడం వరకు... సల్మాన్ బహుళ నటీనటుల ప్రయాణాలలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఈరోజు డిసెంబర్ 27న ఆయన 56వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, సల్మాన్ ద్వారా సినిమాల్లో పరిచయమైన నటీమణుల గురించి ఇక్కడ చూద్దాం.

స్నేహ ఉల్లాల్
2006 విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్‌'తో స్నేహ ఉల్లాల్‌ను లాంచ్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక పోయినప్పటికీ స్నేహ తన లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ఐశ్వర్యరాయ్‌ను పోలి ఉండటం మీడియాలో మరియు అభిమానులలో చాలా చర్చనీయాంశమైంది.

జరీన్ ఖాన్
 2010 విడుదలైన సల్మాన్ 'వీర్' నటి జరీన్ ఖాన్ తొలి చిత్రం. ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. జరీన్, కత్రినా కైఫ్ లుక్‌ ల మధ్య ఉన్న పోలికలు అభిమానులలో చాలా సంచలనం సృష్టించాయి. జరీన్ బాలీవుడ్, పంజాబీ చిత్రాలలో తనదైన పేరును సంపాదించుకుంది. సల్మాన్ 2011లో విడుదలైన 'రెడీ' చిత్రంలో కూడా ఆమె అతిథి పాత్రలో కనిపించింది.

సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా 2010లో విడుదలైన దబాంగ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ తో కలసి అరంగేట్రం చేసింది. యాక్షన్ డ్రామా హిందీ చిత్రాల చరిత్రలో అతి పెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. సోనాక్షి కెరీర్‌కు సరైన లాంచ్‌ ప్యాడ్‌ని అందించింది. తొలి దశలోనే సోనాక్షి బాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె దబాంగ్ ఫ్రాంచైజీ సీక్వెల్స్‌లో కూడా కనిపించింది.

డైసీ షా
2014 విడుదలైన 'జై హో'లో డైసీ షా హీరోయిన్ గా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆమె రెమో డిసౌజా 'రేస్ 3'లో సల్మాన్‌తో జతకట్టింది.

సాయి మంజ్రేకర్
సల్మాన్ చిత్ర నిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయిని 2019 విడుదలైన 'దబాంగ్ 3'తో వెండి తెరకు పరిచయం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సాయి కెరీర్‌కు డ్రీమ్ స్టార్ట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: