లవర్ బోయ్ నితిన్ మాస్ ఇమేజ్ కోసం ఎంత ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్స్ తోనే హిట్ అందుకుంటున్న నితిన్ తనని తాను మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ అలా చేసిన ప్రతిసారి అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈ క్రమం లో నితిన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో మరోసారి మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని టాక్. నితిన్ హీరో గా రైటర్ కం డైరక్టర్ వక్కంతం వంశీ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో నితిన్ మాస్ హీరోగా కనిపిస్తాడని టాక్. నా పేరు సూర్య సినిమాతో డైరక్టర్ గా చేదు అనుభవాన్ని మూట కట్టుకున్న వక్కంతం వంశీ తన ద్వితీయ ప్రయత్నాన్ని చాలా కేర్ ఫుల్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ అంతకుముందు వక్కంతం వంశీ కథ అందించిన కిక్, రేసుగుర్రం సినిమాల తరహాలోనే నితిన్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈసారి నితిన్ కూడా మాస్ హీరోగా తన సత్తా చాటనున్నాడు.

ఈ సినిమాతో పాటుగా నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమా చేస్తున్నాడు నితిన్. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ మూవీగా వస్తుంది. మరి రానున్న రెండు సినిమాలతో నితిన్ తన మాస్ స్టామినా చూపించి హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా నితిన్ మరో స్టార్ డైరక్టర్ తో సినిమా డిస్కషన్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సినిమాకు సంబందించిన ఎక్స్ క్లూజివ్ డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయట. నితిన్ కూడా తన సినిమాల ప్లానిగ్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: