ఈ మధ్య కాలంలో చాలామంది హీరో లుగా మారడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన వాళ్ళు అయినా సరే..కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వాళ్ళు అయినా సరే లేదా రాజకీయ నాయకుల వారసులైనా సరే ఇండస్ట్రీ లోకి కొత్తగా హీరోలుగా ప్రవేశం చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ శ్రీరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే సిద్ శ్రీరామ్ ను  ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం చేసిన మణిరత్నం అతడిని హీరోగా పరిచయం చేయబోతున్నారని.. నెట్టింట్లో ఈ వార్త హల్చల్ చేస్తోంది. ఇకపోతే తమిళ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం ఇండియన్ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు.. ప్రేమకథా చిత్రాలను సరికొత్త కోణంలో ఆవిష్కరించే వారిలో ఈయన తర్వాతనే ఎవరైనా సరే అని చెప్పాలి.. విజువల్స్, ఎమోషన్స్, లవ్, కథాంశం ఇలా అన్ని కోణాలతో సినిమాలో ఆయన ప్రజెంట్ చేసే విధానం అన్నీ కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.. అంతేకాదు అప్పుడప్పుడు కొత్తకొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే మరో ప్రయోగానికి సిద్ధం అయ్యారు మణిరత్నం.ఇకపోతే సిద్ శ్రీరామ్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సింగర్ గా పరిచయం అయిన విషయం అందరికి తెలిసిందే.. ముఖ్యంగా డిఫరెంట్ వాయిస్ తో ఆయన పాడే పాటలకు తెలుగులో మంచి క్రేజ్ కూడా ఉంది.. ఆయనతో పాట పాడిస్తే.. ఆ సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన నిర్మాతలు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పటికీ ఈయన పాడిన ఎన్నో పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. పాటలతో బిజీగా ఉన్న సిద్ శ్రీరామ్ కు ఒక కథ చెప్పగా అందుకు ఇంప్రెస్స్ అయ్యి యాక్టింగ్ చేయడానికి ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే హీరో గా పరిచయం చేయబోతున్న దర్శకుడు మణిరత్నం ఆ సినిమాకు దర్శకుడు గా వ్యవహరిస్తాడా లేక నిర్మాతగా పని చేస్తాడా అనేది మాత్రం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: