ఆర్జీవీకీ,మెగా కుటుంబానికీ  ఏ సంబంధం లేదు.లేదు క‌నుక మాట్లాడకూడ‌దు..ఇదే మాట గ‌తంలో నాగ‌బాబు కూడా చెప్పాడు. ప‌వ‌న్ అయితే ఆర్జీవీని ప‌ట్టించే ప‌ట్టించుకోడు.బ‌న్నీ మాత్రం ఆ మాటలు విని,త‌న‌పై రాము చేసిన పాజిటివ్ కామెంట్స్ విని ఉబ్బిత‌బ్బిబ‌యిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు ..కానీ ఎందుక‌ని ఇలాంటి స్టేట్మెంట్లు.? ఏదేమయిన‌ప్ప‌టికీ ఇవాళ్టి ట్రోల్ వ‌ర్డ్ ఆర్జీవీ.....

మెగా కుటుంబంలో చిచ్చురేపాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది ఆర్జీవీకి.ఆయ‌నకెందుకు ఈ అవ‌స‌రం లేని ప‌నులు? ఇవి మీరు ఆయ‌న‌ను అడిగితే.. నా దృష్టిలో బ‌న్నీ యునీక్ అంటాడు.ఆయ‌న‌కూ,చిరుకూ సంబంధ‌మే లేదంటాడు.ఆయ‌న‌లో ఎన‌లేని గ్రేస్  ఉంద‌ని అంటాడు.కాసేపు ఆగితే అవ‌న్నీ ఎందుకు అన్నానో కూడా తెలియ‌ద‌ని,ఆ మూడ్ లో ఉన్న‌ప్పుడే అని ఉంటాను కానీ..ఇప్పుడు మీరు వాటి వివ‌రం అడిగితే ఆ మాట‌లకు

నా ద‌గ్గ‌ర కూడా నిర్వ‌చ‌నాలు కానీ అర్థాలు కానీ లేవ‌ని చెబుతాడు.అందుకే ఆ జీవి పిచ్చి..లోకంలో వేరెవ్వ‌రికీ  ఉండ‌దు గాక ఉండదు.ఉండొద్దు గాక ఉండొద్దు.

 

ఆర్జీవీ ఓ చ‌చ్చిన పాము..కాదు చావ‌ని పాము అని కూడా రాస్కోండి.ఆయ‌న ప‌ట్టించుకోడు.ఆయ‌నేం మాట్లాడినా కూడా ఎవ్వ‌రికీ అర్థం కాదు.గ‌త కొద్ది కాలంగా ఎందుక‌నో బ‌న్నీ వేరు /చిరు వేరు ఆ  ఇద్ద‌రి ఇమేజ్ అన్న‌ది వేరు..వేరు..అన్న డ్రామా ఒక‌టి న‌డుపుతున్నాడు.ఆ విధంగా మెగా ఫ్యాన్స్ లో చీలిక‌లు తెచ్చేందుకు తెగ ప్రయ‌త్నిస్తున్నాడు.వీటి ద్వారా ఆయ‌న సాధించేదేంటి? ఆయ‌న కొత్త‌గా లేనిపోని ర‌గ‌డ సృష్టించి జుర్రుకునేందేంటి? అంటే ఏమీ ఉండ‌దు ఆయ‌న‌కు వివాదాలు ఓ టైం పాస్..బ‌న్నీ వివాదం కార‌ణంగా కాస్త‌యినా మ‌ళ్లీ ఫేమ‌స్ కావొచ్చు అన్న‌ది  ఓ గేమ్ ప్లాన్.క‌క్కుర్తి కూడా! పేరు క‌క్కుర్తి అని కూడా దీనినే అనాలి. తెలుగులో కీర్తి కండూతి అని కూడా అంటారులేండి.


వివాదాలు ఏమీ లేన‌ప్పుడు అంతా త‌మ ప‌ని తాము చేసుకుంటున్న‌ప్పుడు వ‌చ్చే సునామీ పేరు ఆర్జీవీ.ఇప్పుడు మెగాస్టార్ ఎవ‌రు న్యూ మెగా స్టార్ ఎవ‌రు ఎవ‌రు ఎందుకు కాదు ఎవ్వ‌ర‌న్నా అడిగారా నిన్ను అంటే న‌వ్వుతాడు.వెర్రి న‌వ్వు ఒక‌టి న‌వ్వు నా ట్వీట్ నా ఇష్టం అని అంటాడు.ఆ విధంగా మ‌ళ్లీ  ఏదో ఒక‌టి కామెంట్ చేసి వెళ్తాడు. తాజాగా సంచ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్జీవీ ట్రోల్ అవుతున్నాడు.ఈ ఉద‌యం అల్లు అర్జున్ పై ఆయ‌న చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ లో మ‌రో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.ఇండ‌స్ట్రీలో అల్లు అర్జున్ రూటే సెప‌రేటు అని గ‌తంలోనూ ఆయ‌న అన్నారు.తాజాగా ఆయ‌న న్యూ మెగాస్టార్ అని కితాబిచ్చారు.ఉన్న‌ట్టుండి చిరంజీవి కుటుంబంపై ఆర్జీవీ ఎందుకు వ్యాఖ్య‌లు చేస్తున్నాడో కానీ మొత్త‌మ్మీద ఈ మాట‌లు వెనుక నిగూఢార్థం ఏదో ఉండి ఉండాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

rgv