కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. 2004 సంవత్సరంలో తన కంటే రెండు సంవత్సరాలు పెద్దదైన రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నుంచి వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమ అభిమానాలు చూపించేవారు. దర్శకురాలిగా నిర్మాతగా ఐశ్వర్య ఎంతగానో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో కూడా ధనుష్ కూడా అటు రజనీకాంత్ అల్లుడుగా కాకుండా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ జంట ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉంటూ కోలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.


 ఇక ఇలాంటి జంట ఇటీవలే 18 ఏళ్ల దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అభిమానులందరికీ షాక్ ఇచ్చారు అనే చెప్పాలి. ఒకవైపు ఐశ్వర్య మరోవైపు ధనుష్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వీరు విడాకుల ప్రకటన తర్వాత అభిమానులు అందరూ షాక్ లో మునిగిపోగా త్వరలో ధనుష్ ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారు అంటూ అటు ధనుష్ తండ్రి కస్తూరి రాజా కామెంట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో రానున్న రోజుల్లో వీలు మళ్లీ కలవబోతున్నారా లేక అఫీషియల్ గా విడాకులు తీసుకోబోతున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక పోతే ఇక ధనుష్ తో విడాకులు తీసుకుంటున్న అని ప్రకటించిన తర్వాత ఐశ్వర్య ఏం చేస్తుంది అన్న దానిపై కూడా వెతకడం ప్రారంభించారు అందరు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఐశ్వర్య వృత్తిలో బిజీ అయిపోయిందట. ప్రస్తుతం ఒక లవ్ సాంగు చిత్రీకరించే పనిలో ఉందట ఐశ్వర్య. ఫిబ్రవరి 14 లవర్స్ డే  రోజున ఈ సాంగును ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఇందులో కాస్త రొమాన్స్ ను కూడా కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఇక ఈ సాంగ్ సంబంధించిన షూటింగ్ ఈనెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్లోనే జరిగిపోతున్నట్లు కోలీవుడ్లో టాక్ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: