పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న  భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా `హరి హర వీర మల్లు` షూటింగ్ వచ్చే నెలలో పునఃప్రారంభించనున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 17వ శతాబ్దపు యోధుడి పాత్ర చేయబోతున్నాడట. ఇక ఆ పాత్రకు సరిపోయేలా తన జుట్టును కూడా పవన్ కళ్యాణ్ పెంచుతున్నాడు.ఇక మనం చదువుకునే చందమామ కథల్లో యోధుడిలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తారని గుసగుస వినిపిస్తోంది. ఆంగ్లేయులను ఎదుర్కొనే వీరమల్లు రూపం విక్రమార్కుడినే తలపిస్తుందన్న గుసగుసా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇక సినిమా దర్శకుడు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి స్క్రిప్ట్ లో తాను చేసిన మార్పులను వివరించాడు. ఇక సినిమా షూటింగ్ ఆగిపోయాక.. సుదీర్ఘ కరోనా వైరస్ మహమ్మారి కాలాన్ని సద్వినియోగం చేసుకున్న క్రిష్ ..తన ఆస్థాన రచయితలతో కలిసి స్క్రిప్ట్ ను ఫ్యాన్స్ కి పూనకాలు  తెప్పించే లాగా ఈ సినిమాని ఒక మంచి ఆకృతిలోకి తీసుకువచ్చారు.ఇక ఈ సినిమా షూటింగ్ ని మళ్లీ ప్రారంభించేందుకు భారీ సెట్లు కూడా వేస్తున్నారు నిర్మాతలు. 

ఇక మంచి పీరియాడికల్ డ్రామాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నాడు. ఇక హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అతని ప్రియురాలి పాత్రలో నటిస్తుండగా.. అలాగే నర్గీస్ ఫక్రీ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రముఖ స్టార్ నిర్మాత AM రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో నిర్మిస్తున్నారు. తెలుగు-తమిళం-హిందీ బాషల లో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమట.

మరింత సమాచారం తెలుసుకోండి: